Today Top Headlines: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి - సిరిసిల్ల జిల్లాలో విషాదకర ఘటన, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:
1. మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి (Mudragada Padmanabha Reddy) నివాసంలో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి ఇంట్లోకి ఏకంగా ట్రాక్టర్‌తో దూసుకొచ్చి బీభత్సం సృష్టించాడు. గన్నిశెట్టి గంగాధర్ అనే యువకుడు ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌తో దూసుకొచ్చి ఆయన ఇంటి గేటును ఢీకొట్టాడు. ఇంటి కాంపౌండ్‌లో పార్క్ చేసిన కారును ఢీకొట్టి ధ్వంసం చేశాడు. ఇంటి బయట శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకువచ్చిన కుటుంబసభ్యలు అతడిని చూసి భయాందోళనకు గురయ్యారు. ఇంకా చదవండి.
2. ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ షాకిచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 18,036 మంది పింఛన్లను తొలగించింది. జనవరిలో 63,77,943 మంది పింఛన్ పొందగా, ఫిబ్రవరిలో భారీగా కోత పెట్టింది. ఫిబ్రవరిలో 63,59,907 మంది లబ్ధిదారులకు పింఛన్ అందించనుంది. పింఛన్ల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన వారికి ఇక నుంచి దివ్యాంగ పింఛన్లు రావని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న రాష్ట్రంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మొదలైంది. ఇంకా చదవండి.
3. సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారక ఘటన
సొంత ఇల్లు లేకపోవడంతో ఓ కుటుంబం మృతదేహంతో రాత్రంతా అంబులెన్స్‌లో గడపాల్సి వచ్చింది. సంతోష్ అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో చనిపోగా, హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లారు. కానీ మృతదేహాన్ని ఇంట్లో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా అంబులెన్స్ లోనే ఉంచారు. ఆయన పిల్లలు కూడా అందులోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. గ్రామస్తులు సాయం చేయడంతో చేనేత కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. ఇంకా చదవండి.
4. బేతాళం పూజలతో ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరలో మెస్రం వంశీయులు బేతాల్ పూజలతో తమ సాంప్రదాయ పూజలు ముగించారు. పుష్యమాస అమావాస్యను సందర్భంగా జనవరి 28న అర్థరాత్రి మహాపూజతో నాగోబా జాతర (Nagoba Jatara)ను ప్రారంభించిన మెస్రం వంశీయులు శనివారం బేతాల్ పూజలు చేసి సాంప్రదాయ పూజలు పూర్తిచేశారు. ముందుగా సంప్రదాయ వాయిద్యాల మధ్య గోవాడ ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశ మహిళలు మెస్రం వంశ పెద్దల కాళ్లు కడిగి బేతాళ్ పూజలకు ఆహ్వానించారు. ఇంకా చదవండి.
5. కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రూపింగ్ వెనుక బీజేపీ
తెలంగాణ రాజకీయాల్లో ఓ అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు షాద్‌నగర్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి పామ్ హౌస్‌లో చర్చలు జరిపారన్న విషయం బయటకు తెలియడంతో గగ్గేలు రేగింది. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు పనులు, బిల్లులు రాకుండా చేస్తున్నామని తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

