Telangana Politcs: కాంగ్రెస్ ఎమ్మెల్యేల గ్రూపింగ్ వెనుక బీజేపీ - రేవంత్ సర్కార్ మనుగడపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు అదే సంకేతమా?
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ గ్రూపుగా మారడం హాట్ టాపిక్ గా మారుతోంది. వారి వెనుక బీజేపీ ఉందా అన్న చర్చ కూడా ప్రారంభమయింది.

Is BJP behind the meeting of Telangana Congress MLAs: తెలంగాణ రాజకీయాల్లో ఓ అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు షాద్‌నగర్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి పామ్ హౌస్‌లో చర్చలు జరిపారన్న విషయం బయటకు తెలియడంతో గగ్గేలు రేగింది. ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు పనులు, బిల్లులు రాకుండా చేస్తున్నామని తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. అంతర్గతంగా ఏం జరుగుతుందో కానీ..ఈ పరిణామంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభుత్వం పడిపోవాలని తమకు లేదన్న కిషన్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురవుతున్నారని వారు విడిగా సమావేశమైన అంశం తెలియదని కిషన్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదన్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను అంతకంతకూ పెంచుకుంటోందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పడిపోతే తాము రావాలని అనుకోవడం లేదన్నారు. నాలుగేళ్ల పాటు వెయిట్ చేస్తామని కూడా చెప్పారు. కిషన్ రెడ్డి ఇలా చెప్పారంటే.. ప్రత్యేకంగా ఏదో ఉందన్న అభిప్రాయానికి వస్తున్నారు. ప్రజా వ్యతిరేకత వల్లనే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారని తర్వాత చెప్పే అవకాశాల్ని రాజకీయాల్లో కాదనలేమని అనుకోవచ్చు.
ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉండే అవకాశం ఉందా?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు ఉద్దవ్ ధాక్రేకు అత్యంత సన్నిహితుడు అయిన .. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న షిండే తిరుగుబాటు చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా వరుసకట్టి ఉద్దవ్ కు గుడ్ బై చెప్పారు. చివరికి ఏం జరిగిందో అందరూ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని ఏకంగా పది మంది సమావేశం కావడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ ఏదైనా ఆపరేషన్లు చేయాలనుకుంటే సీక్రెట్ గా చేసేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటిదేమైనా జరుగుతుందో లేదో చెప్పడం కష్టం. కానీ పూర్తిగా తోసిపుచ్చడం కూడా తప్పేనని అనుకోవచ్చంటున్నారు.
ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఏమిటి ?
కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారలోకి రాలేదు. కేవలం నలుగురు ఎమ్మెల్యేల మెజార్టీతో మాత్రమే అధికారంలోకి వచ్చారు. అయితే తర్వాత బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీలో చేరారు. వీరిలో ఎంత మంది మళ్లీ కాంగ్రెస్ పార్టీలో ఉంటారన్నది కూడా కష్టమే. కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉన్న వారు ఆరేడుగురు ఉన్నారు. వీరంతా రాజకీయ అవసరాల కోసం పార్టీ మారారు. వీరిని పక్కన పెడితే.. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు.. రాజకీయం చేస్తే రేవంత్ సర్కార్ రిస్క్ లో పడుతుంది. అయితే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తారని చెప్పక తప్పదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యూహం పాటిస్తారన్నది కీలకం. ఈ వ్యవహారంలో బీజేపీ లేకపోతే టీ కప్పులో తుపానులాగా తేలిపోతుంది. ఒక వేళ ఉంటే మాత్రం.. పెద్ద తుపానుగా మారుతుంది. ఏం జరుగుతుందో.. వెయిట్ అండ్ సీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

