AP Pensions: ఏపీలో పెన్షనర్లకు బిగ్ షాక్, 18,036 మంది పింఛన్లను తొలగించిన కూటమి ప్రభుత్వం
Andhra Pradesh News | ఏపీలో పెన్షన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. ప్రతి జిల్లాలోనూ 96 శాతానికి పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం.

Andhra Pradesh government removes pensions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు భారీ షాకిచ్చింది. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 18,036 మంది పింఛన్లను తొలగించింది. జనవరిలో 63,77,943 మంది పింఛన్ పొందగా, ఫిబ్రవరిలో భారీగా కోత పెట్టింది. ఫిబ్రవరిలో 63,59,907 మంది లబ్ధిదారులకు పింఛన్ అందించనుంది. పింఛన్ల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన వారికి ఇక నుంచి దివ్యాంగ పింఛన్లు రావని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న రాష్ట్రంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ మొదలైంది. అయితే అనర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి 18 వేల మందిని కూటమి ప్రభుత్వం తొలగించింది.
పెన్షన్లు రీ చెక్ చేస్తున్న ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం జనవరిలో దివ్యాంగుల పెన్షన్లను పునఃపరిశీలించింది. అర్హత లేని వారు, బోగస్ సర్టిఫికెట్లతో వైకల్యం లేకున్నా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిని పింఛన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు తక్షణం వాటిని పరిశీలించి ఫిబ్రవరి నెల నుంచి అనర్హులకు పింఛన్ కట్ చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కొందరు చనిపోయిన వారి పేర్లు, తప్పుడు ధ్రువపత్రాలతో పెన్షన్ పొందుతున్న వారి పేర్లు సైతం తొలగించారు. అనర్హులను పెన్షనర్ల జాబితా నుంచి తొలగించడంతో ప్రభుత్వంపై అదనపు బారం తప్పనుంది. వార్త రాసే సమయానికి ఏపీలో పెన్షన్లపై తాజా సమాచారం ఇలా ఉంది.
నెం | జిల్లాలు | పెన్షనర్ల వివరాలు | నగదు వివరాలు | ||||
---|---|---|---|---|---|---|---|
మొత్తం పెన్షన్లు | పంపిణీ అయినవి | శాతం | నగదు విడుదల రూ. | పంపిణీ నగదు రూ. | శాతం | ||
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
1 | ANNAMAYYA | 218157 | 211122 | 96.78 | 933722500 | 902288000 | 96.63 |
2 | TIRUPATI | 263191 | 254347 | 96.64 | 1121935500 | 1082799500 | 96.51 |
3 | ANANTHAPUR | 280327 | 270812 | 96.61 | 1239690000 | 1195975000 | 96.47 |
4 | CHITTOOR | 265698 | 256666 | 96.6 | 1128837000 | 1089694500 | 96.53 |
5 | ALLURI SITHARAMA RAJU | 123361 | 118907 | 96.39 | 517402500 | 497646000 | 96.18 |
6 | VIZIANAGARAM | 274541 | 263928 | 96.13 | 1155556000 | 1109571500 | 96.02 |
7 | EAST GODAVARI | 236331 | 227138 | 96.11 | 1021440000 | 980279500 | 95.97 |
8 | KURNOOL | 239332 | 229234 | 95.78 | 1028959000 | 984045000 | 95.64 |
9 | SRI SATHYA SAI | 263908 | 252572 | 95.7 | 1143726000 | 1091902500 | 95.47 |
10 | GUNTUR | 253464 | 242495 | 95.67 | 1090934000 | 1041864000 | 95.5 |
11 | NTR | 229914 | 219838 | 95.62 | 982008000 | 937351500 | 95.45 |
12 | YSR | 257485 | 246148 | 95.6 | 1105858000 | 1055776000 | 95.47 |
13 | BAPATLA | 227434 | 217414 | 95.59 | 959750000 | 916305000 | 95.47 |
14 | VISAKHAPATNAM | 160757 | 153625 | 95.56 | 697477500 | 665266000 | 95.38 |
15 | KRISHNA | 236291 | 225468 | 95.42 | 1016023000 | 968176000 | 95.29 |
16 | ELURU | 261454 | 249420 | 95.4 | 1130096000 | 1076458000 | 95.25 |
17 | ANAKAPALLI | 257457 | 245199 | 95.24 | 1077210500 | 1023457000 | 95.01 |
18 | PALNADU | 272932 | 259609 | 95.12 | 1178799000 | 1119510500 | 94.97 |
19 | NANDYAL | 215592 | 205035 | 95.1 | 919120000 | 873520000 | 95.04 |
20 | WEST GODAVARI | 227086 | 215913 | 95.08 | 967159500 | 918267500 | 94.94 |
21 | SRIKAKULAM | 311533 | 295793 | 94.95 | 1296134000 | 1225982000 | 94.59 |
22 | NELLORE | 306039 | 290578 | 94.95 | 1313384500 | 1244255000 | 94.74 |
23 | MANYAM | 140460 | 132966 | 94.66 | 592856000 | 559903000 | 94.44 |
24 | KAKINADA | 272437 | 257856 | 94.65 | 1166687500 | 1100896500 | 94.36 |
25 | KONASEEMA | 237244 | 224379 | 94.58 | 1005589500 | 948559500 | 94.33 |
26 | PRAKASAM | 284637 | 266545 | 93.64 | 1233158500 | 1150057500 | 93.26 |
27 | ART (PLHIV) Pensions | 42845 | 42781 | 99.85 | 171564000 | 171148000 | 99.76 |
Total | 6359907 | 6075788 | 95.53 | 27195078000 | 25930954500 | 95.35 |
Also Read: Pawan Kalyan: కేంద్రం సాహసోపేత నిర్ణయం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం: బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

