అన్వేషించండి

SC Classification: ఎస్సీ వర్గీకరణ.. రేవంత్ ​రెడ్డిపై రాజయ్య, మందకృష్ణ షాకింగ్​ కామెంట్స్

Telangana News: ఎస్సీ వర్గీకరణ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు.

Telangana News: ఎస్సీ వర్గీకరణ (Classification of SC)అంశంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. వేర్వేరు మీడియా సమావేశాల్లో ఆ ఇద్దరు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రేవంత్​ రెడ్డి రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తున్నారని, మాలల సూచనలు పాటిస్తున్నారని ఆరోపించారు. తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగకపోతే ఉద్యోగాల విషయంలో మాదిగ బిడ్డలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. 

మాలలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారు
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని మానుకోవాలని రాజయ్య సూచించారు. సీఎం రేవంత్​ బయటకు మాదిగలకు అనుకూలంగా ఉన్నట్లు నటిస్తున్నా.. లోలోపల మాలలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మాదిగ యువతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఉగ్యోగాల ఫలితాల ప్రకటనను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే ప్రయత్నం...
ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలం అంటూనే సీఎం రేవంత్ రెడ్డి మాలల సూచనలు పక్కాగా అమలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందే ఉద్యోగాలన్నీ మాలలకు కట్టబెట్టే పనిలో సీఎం నిమగ్నమయ్యారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే.. సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి యూనివర్సిటీల్లో నిరవధిక దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చాకే రాష్ట్రంలో ఉద్యోగాలను భార్తీ చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

మొన్న సీఎంకు మందకృష్ణ లేఖ
ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి శనివారం మంద కృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను నిలిపివేయాలని సదరు లేఖలో పేర్కొన్నారు. ఈనెల 12 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం చట్టం చేస్తామని ప్రభుత్వం చెప్పిందని.. అంతలోనే గ్రూప్స్ ఫలితాల వెల్లడి తేదీలను ప్రకటించడం సరైంది కాదన్నారు. వర్గీకరణ జరగకముందే ఫలితాలు వెల్లడిస్తే ఎస్సీలకు మళ్లీ అన్యాయం జరుగుతుందని మందకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.

బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశం
ఈనెల 6న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఏకపక్షంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి సుధీర్ఘంగా చర్చించి ఆమోదం తెలుపనున్నారు. 

బీసీ కులగణన సర్వేపై కూడా.. 
బీసీ కులగణనపై చేపట్టిన సర్వేపై కూడా మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును కూడా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. అదే విధంగా సెర్ఫ్, మెప్మా రెండింటిని కలిపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. స్థానిక సంస్థల ఎన్నిక ఉద్యోగాల భర్తీ విషయంలో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్ సూత్రాన్ని తెలంగాణలో అమలు చేయాలని కేంద్రాన్ని కోరాలని క్యాబినెట్ నిర్ణయించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్Rohit Sharma 76* vs CSK IPL 2025 | హిట్ మ్యాన్ ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటుందో చూపించిన రోహిత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ప్రపంచంలో అరుదైన వ్యక్తిగా గుర్తింపు
Vemulawada Politics: మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
మోసం చేసి గెలిచాడు, చెన్నమనేనికి ప్రభుత్వ బెనిఫిట్స్ ఆపేయాలి- ఆది శ్రీనివాస్
Tesla Y in india: ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
ఇండియాలో అడుగుపెడుతున్న టెస్లా.. భారత్‌లో  ధర ఎంతో తెలుసా..?
Gollapudi Panchayat: ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
ఏపీలోని గొల్లపూడి పంచాయతీకి జాతీయ అవార్డు, ఈ 24న మోదీ ప్రదానం- పవన్ కళ్యాణ్ వద్దే ఆ శాఖ
Rambha: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
CM Revanth Reddy: ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి, తొలి రాష్ట్రంగా ఘనత 
BCCI Retainership: బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లిస్ట్‌ విడుదల- అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ కాంట్రాక్ట్
Yash: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
Embed widget