Nagpur Patanjali Herbal Plant: నాగ్‌పూర్ పతంజలి ఫుడ్ పార్క్ రైతుల జీవనాన్ని మారుస్తుంది- ఆచార్య బాలకృష్ణ
Nagpur Patanjali Herbal Plant: నాగ్‌పూర్‌లోని పతంజలి మెగా ఫుడ్ హర్బల్ పార్క్ మార్చి 9న ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించనున్నారు

Nagpur Patanjali Herbal Plant: నాగ్‌పూర్‌లోని MIHAN ప్రాంతంలో నిర్మించిన పతంజలి మెగా ఫుడ్ మరియు హర్బల్ పార్క్ ఈ నెల 9న ఆదివారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ ప్లాంట్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించనున్నారు. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈ ప్రాజెక్టు స్థానిక వ్యవసాయ వ్యవస్థను మార్చేందుకు దోహదపడుతుందని, రైతుల జీవనోపాధిని గణనీయంగా మెరుగుపరుస్తుందని తెలిపారు. అలాగే, ఈ ప్రాంతంలోని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పతంజలితో అనుసంధానమవుతున్నారని వెల్లడించారు.
నారింజ ప్రాసెసింగ్ ప్లాంట్ వ్యవసాయ రంగాన్ని మార్చబోతుంది: ఆచార్య బాలకృష్ణ
శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆచార్య బాలకృష్ణ, "ఈ ప్రాంత రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. విదర్భ ప్రాంతం గురించి చెప్పినప్పుడు రైతుల దుస్థితి, వారి ఆత్మహత్యల గురించిన దృశ్యమే ముందుగా గుర్తుకు వస్తుంది. కానీ, ఈ నారింజ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాతం స్వరూపమే మారిపోనుంది.” అని అన్నారు.
ఈ ప్లాంట్ విజయవంతం కావడానికి అందరి సహకారం అవసరమని బాలకృష్ణ తెలిపారు. "మా ప్రాధాన్యత స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడం, రైతులను ఆర్థికంగా స్థిరపడేలా చేయడం. ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామ రైతు పతంజలితో అనుసంధానమై ఉన్నారు. అలాగే, కొంతమంది ప్రతిభావంతులైన వ్యక్తులను కూడా గుర్తించాం. రైతుల దుస్థితిని మార్చడం, వ్యవసాయ వ్యవస్థను మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాం" అని అన్నారు.
ప్రాజెక్టును చివరి దశకు తీసుకురావడంలో కొంత ఆలప్యం అయింది. కోవిడ్-19 కారణంగా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఎక్కువ సమయం పట్టిందని, కానీ అంకితభావంతో ముందుకు సాగి ప్లాంట్‌ను విజయవంతంగా ప్రారంభించగలిగామని బాలకృష్ణ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల కలను సాకారం చేయడంలో పతంజలి కీలక పాత్ర పోషిస్తోందని, దేశవ్యాప్తంగా మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పతంజలి కృషి చేస్తుందని పేర్కొన్నారు.





















