అన్వేషించండి

Syria Killings: సిరియాలో ప్రతీకార హత్యలు.. వేయి మందికి పైగా మృతి

సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మద్దతుదారులు మళ్లీ తిరుగుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. దీంతో దేశంలో మళ్లీ హింస చెలరేగి ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Revenge killings in Syria: సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మద్దతుదారులు మళ్లీ  తిరుగుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. దీంతో దేశంలో మళ్లీ హింస చెలరేగి ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సిరియా అంతర్యుద్ధం మొదలైన 14 సంవత్సరాల్లో దీన్ని అత్యంత హింసాత్మక, దారుణమై ఘటనగా పేర్కొంటున్నారు. 

745 మంది సాధారణ పౌరులు
బ్రిటన్ ఆధారిత సిరియన్ ఆబ్సర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. బషర్​ అల్​ అసద్‌ మద్దతుదారులు మొదట గురువారం ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు ప్రతిదాడికి దిగాయి. రెండు రోజులు కొనసాగిన ఈ ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా మృతి చెందగా వారిలో 745 మంది సాధారణ పౌరులు ఉన్నారు. 125 మంది భద్రతా సిబ్బంది, 148 మంది అసద్‌ మద్దతుదారులు కూడా మరణించారు. ఫలితంగా లతాకియా నగర పరిసరాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా పూర్తిగా నిలిపివేశారు.

మత సంఘానికే చెందిన వ్యక్తులపై ప్రతీకార హత్యలు
తిరుగుబాటుదారులు ఇటీవల సిరియాను ఆక్రమించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు అసద్‌  కుటుంబంతో సహా రష్యాకు పారిపోయారు. తిరుగుబాటుదారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం అసద్‌ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుపెట్టాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సున్నీ ముస్లిం గన్​మెన్‌లు, అసద్​కు చెందిన మైనార్టీ అలవైట్​లు మత సంఘానికే చెందిన వ్యక్తులపై ప్రతీకార హత్యలు చేయడం ప్రారంభించారు. తిరుగుబాటుదారులకు సహకరించారనే కోపంతో ఈ చర్యలకు దిగారు. 

ఇళ్లకు నిప్పు, వీధుల్లోకి లాక్కొచ్చి ఊచకోత
అలవైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించి వారి ఇళ్లకు నిప్పంటించడంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అలవైట్లను వీధుల్లోకి లాక్కొచ్చి ఊచకోత కోశారు. బనియాస్ పట్టణంలో జరిగిన ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలావైట్ల మృతదేహాలు వీధుల్లో, ఇళ్లలో పడి ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వాటిని తీసుకునేందుకు కూడా ఎవ్వరూ సాహసం చేయడం లేదు. చావు భయంతో వేలాది మంది సమీప కొండ ప్రాంతాల్లోకి పారిపోయి తలదాచుకున్నారు. దాడుల్లో చనిపోయిన ఐదుగురు సిరియా దళ సభ్యులకు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. సిరియాలోని రామీ అబ్దుర్హమాన్, ఆబ్జర్వేటరీ చీఫ్, ప్రతీకార హత్యలు శనివారం ఉదయం ఆగిపోయాయని చెప్పారు.

ప్రాణభయంతో పారిపోయాం
బానీయాస్‌లో అలవైట్‌ కాలనీకి చెందిన దాదాపు 20 మంది పౌరులు హతమైనట్లు ఆ ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల అలీ షేహా తెలిపారు. తమ ప్రాంతంలో శుక్రవారం హింస ప్రారంభమైన తర్వాత తన కుటుంబం, పొరుగువారితో కలిసి పారిపోయానని పేర్కొన్నారు. ‘ఇది దారుణం. అసద్​ మద్దతుదారులు తమ అపార్టుమెంట్​ వద్దకు వచ్చి విక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ప్రాణ భయంతో మేము పారిపోయాం. వారు కొంతమందిని హతమార్చి మా ఇండ్లను దోచుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Embed widget