అన్వేషించండి

Telangana Latest News: ఎమ్మెల్సీగా విజయశాంతి- అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్- జాబితా ఇదే !

Telangana Latest News: తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. విజయశాంతికి అవకాశం ఇచ్చింది.

Telangana Latest News: ఉదయం నుంచి జరుగుతున్న చర్చలు పూర్తి అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించింది. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌కు అవకాశం ఇచ్చారు. 

విజయశాంతి చాలా సైలెంట్‌గా తన పేరు లిస్ట్‌లో చేర్చుకునేలా చేశారు. ఈ మధ్యే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన విజయశాంతి  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం చేసిన త్యాగాలు  గురించి చెప్పుకొచ్చారు.  ఎన్నికలకు ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటి వరకు తనను పట్టించుకోవడం లేదని ఆమె ఫీల్ అవుతున్నారు. అసెంబ్లీలో కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో కానీ టికెట్‌ ఇవ్వలేదు. ఆమెను ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గోనివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కూడా ఆమె యాక్టివ్‌గా లేకుండా పోయారు. ఆమె ఫేడవుట్ అయ్యారని అంతా అనుకున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. 

మొదటగా తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టిన విజయశాంతి తర్వాత చాలా పార్టీలు మారారు. బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారు. ఇదే ఆమెకు పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓసారి గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీకి, కేసీఆర్‌కు దూరమయ్యారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. తెలంగాణ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓసారి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

అద్దంకి దయాకర్ తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 2023లో టికెట్ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వాడిన పదాలపై పార్టీలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై కోమ‌టిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా క‌మిటీకి ఫిర్యాదు చేశారు. ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై స్పందించిన ద‌యాక‌ర్ ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడాన‌ని తాను వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. వెంక‌ట్ రెడ్డికి వ్యక్తిగ‌తంగా బేషరతుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

IPS Uday Krishna Reddy Suicide Note: మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
మేం రిలేషన్ షిప్‌లో ఉన్నాం - అన్నీ తప్పుడు ఆరోపణలే - ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్‌ నోట్‌లో సంచలన విషయాలు
Dengue Vaccine India: డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
డెంగీకి హైదరాబాద్ మందు! జపాన్‌కు చెందిన QDENGA వ్యాక్సిన్ అమ్మకాలకు భారత్‌ గ్రీన్‌ సిగ్నల్!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Hyderabad Latest News: హైదరాబాద్‌కు చెందిన సిద్ధ వైద్యురాలు సత్య సింధుజకు 'భారత్ సమ్మాన్ పురస్కార్' లభ్యం  
హైదరాబాద్‌కు చెందిన సిద్ధ వైద్యురాలు సత్య సింధుజకు 'భారత్ సమ్మాన్ పురస్కార్' లభ్యం  

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget