Abhinaya Engagement: పెళ్లికి సిద్ధమైన అభినయ... ఎంగేజ్‌మెంట్ జరిగింది, కాబోయే భర్త ఎవరు?
Abhinaya Engagement Photos: నటి అభినయ తనకు నిశ్చితార్థం అయినట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. పెళ్లి భాజాలు మోగాయనే అర్థం వచ్చేలా 'బెల్స్ అండ్ బ్లెస్సింగ్స్' హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు.

Actress Abhinaya engaged at Hyderabad: నటి అభినయ ఇంట పెళ్లి సందడి మొదలైంది. తనకు నిశ్చితార్థం అయ్యిందని ఆవిడ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ శుభకార్యం హైదరాబాద్ నగరంలో జరిగినట్టు తెలుస్తోంది.
కాబోయే భర్త ఎవరు అనేది చెప్పలేదు కానీ...
తనకు నిశ్చితార్థం జరిగిన సంగతి చెప్పిన అభినయ... తనకు కాబోయే భర్త ఎవరు? తనతో కలిసి పెళ్లి మండపంలో ఏడు అడుగులు వేయడంతో పాటు జీవితాంతం నడిచేది ఎవరు? అనేది మాత్రం రహస్యంగా ఉంచారు. కాబోయే భర్త చెయ్యితో పాటు తన చెయ్యి కనిపించేలా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి భాజాలు మోగాయని, పెళ్లి సందడి మొదలైందని అర్థం వచ్చేలా 'బెల్స్ అండ్ బ్లెస్సింగ్స్' హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు.
Also Read: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టిన రోజు... ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
View this post on Instagram
విశాల్, అభినయ పెళ్లి చేసుకుంటారని పుకార్లు!
అభినయ పెళ్లి గురించి కొన్ని రోజుల క్రితం తమిళ చిత్ర సీమలో విపరీతమైన ప్రచారం జరిగింది. తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ కథానాయకుడు, తెలుగువాడైనా విశాల్ - అభినయ ప్రేమలో ఉన్నారని... వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని పుకార్ల వినిపించాయి. అయితే అభినయ వాటిని ఖండించారు. తాను కొన్నాళ్లతో ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, అతను విశాల్ కాదని, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తానని అభినయ పేర్కొన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం గురించి అనౌన్స్ చేశారు. మరి పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారో చూడాలి.
రవితేజ సినిమాలతో తెలుగులో గుర్తింపు!
అభినయకు తెలుగులో మాస్ మహారాజా రవితేజ సినిమాలతో గుర్తింపు లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'నేనింతే' సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ చేశారు. నటిగా ఆమెకు తొలి సినిమా అది. తర్వాత అక్కినేని నాగార్జున 'కింగ్' చేశారు. అయితే... 'శంభో శివ శంభో'లో పాత్ర ఆవిడకు ఎక్కువ గుర్తింపు తెచ్చింది.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు లీకుల బెడద... సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దమ్ము, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్', విక్టరీ వెంకటేష్ - సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'ధ్రువ', ఇటీవల దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతా రామం'తో పాటు పలు సినిమాల్లో ఆవిడ నటించారు. అభినయకు మాటలు రావు. వినికిడి లోపం కూడా ఉంది. అయితే తన ప్రతిభను చాటుకోవడానికి అవేవీ అడ్డంకి కాలేదు. పట్టుదలతో కృషి చేసి నటిగా విజయాలు సాధించారు.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా





















