అన్వేషించండి

BRS: 11న బీఆర్​ఎస్​ శాసనసభా పక్ష సమావేశం.. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్​!

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11న మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రుకానున్నారు.

BRS Legislative Party Meeting: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11న (మంగళవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనున్న స‌మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాలేదు. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరై ఆ తర్వాత మళ్లీ అడుగుపెట్టలేదు. 

బడ్జెట్​ సమావేశాలకు కేసీఆర్​ రావడం ఖాయం
ఈ నెల 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు మాత్రం  హాజరుకావాలని కేసీఆర్​ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు తెలియజేసినట్లు సమాచారం. పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని హైదరాబాద్​లో నిర్వహించనున్నట్లు ప్రకటన రావడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే శాసనసభా పక్ష సమావేశం జరిగేదని పార్టీ నేతలు చెబుతున్నారు. 

అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకే కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నారని.. అందుకే ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలకు కేసీఆర్​ దిశా నిర్దేశం చేయనున్నారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగడుతారని చర్చ సాగుతోంది.

12 నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు
12వ తేదీ నుంచి మొదల్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు జరిగే అవకాశం ఉంది. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ జిష్ణు దేవ్​ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు రెండు సభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. కానీ, బడ్జెట్‌ ఏ రోజు ప్రవేశ పెడుతారు, పద్దులపై ఎన్ని రోజులు చర్చిస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget