అన్వేషించండి

TGPSC: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మార్కుల ప్రకటన తర్వాతే ఎంపిక జాబితా వెల్లడి - మార్కులు ఎప్పుడంటే?

TGPSC: తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి మొదట అభ్యర్థుల మార్కులను ప్రకటించిన తర్వాతే 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను కమిషన్ వెల్లడించనుంది.

TGPSC Group1 Results: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 10న వెల్లడించనుంది. మొదట అభ్యర్థుల మార్కులను ప్రకటించిన తర్వాత.. అభ్యంతరాలున్న వారి నుంచి రీకౌంటింగ్ కోసం ఆప్షన్లు స్వీకరించనుంది. ఈ ప్రక్రియ ముగిశాక 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను కమిషన్ వెల్లడించనుంది. గ్రూప్-1 ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా సాధించినవి అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరనుంది. 

పొరపాట్లు సరిచేసిన తర్వాతే ఫలితాలు.. 
అభ్యర్థుల మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే అభ్యర్థులు 15 రోజుల్లోగా ఒక్కోపేపర్‌కు రూ.1000 చెల్లించి రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఆయా పేపర్లలో మార్కులను మరోసారి గణిస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన తర్వాత మెరిట్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. కాగా గ్రూప్-1 ప్రధాన పరీక్షలకు 21,093 మంది అభ్యర్థులు హాజరుకాగా, ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష నుంచి మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో మొత్తం 31,382 మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసింది. అయితే వీరితోపాటు హైకోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. ఇక మెయిన్స్ పరీక్షలకు సంబంధించి మొత్తం 7 పేపర్లు రాసిన అభ్యర్థులు 21,093 మంది ఉన్నారు. వీరి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఒక్కో పేపరును రెండుసార్లు మూల్యాంకనం చేశారు. ఒక అభ్యర్థి జవాబుపత్రం తొలిదశ మూల్యాంకనం తర్వాత వచ్చిన మార్కులకు.. రెండోదశ మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు పెద్దగా వ్యత్యాసం లేకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను రూపొందించనున్నారు. 

మిగతా పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే..?
గ్రూప్‌-1 ఫలితాలను మార్చి 10న విడుదల చేస్తుండగా.. మార్చి 11న గ్రూప్‌-2 ఫలితాలను, మార్చి 14న గ్రూప్‌-3 ఫలితాలను కమిషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా మార్చి 17న హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్‌ పోస్టుల ఫలితాలను, మార్చి 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్‌ ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ స్పష్టంచేసింది.

గ్రూప్-1 తర్వాత, గ్రూప్-2 పోస్టులకే ప్రాధాన్యం..
తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ 2 ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. 783 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల కోసం ఎగ్జామ్‌ను డిసెంబ్‌ 15, 16 తేదీల్లో నిర్వహించింది. ఆ ఫలితాలను త్వరలోనే విడుదల చేయడానికి ప్రక్రియను వేగవంతం చేసింది. రాష్ట్రంలో 783 గ్రూప్-2 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఉద్యోగాల కోసం 551,855 మంది అభ్యర్థులు రిజిస్టర్ అయ్యారు. వీరిలో 2,50,000 మంది కంటే ఎక్కువ మంది పరీక్ష రాశారు. 33 జిల్లాల్లో 1,368 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. రెండు రోజుల పాటు నాలుగు పేపర్లు రాశారు అభ్యర్థులు. ఒక్కో పేపర్‌ 150 మార్కులు కలిగి ఉంది. 150 క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఇచ్చారు.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి... 

టాప్ హెడ్ లైన్స్

DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget