అన్వేషించండి

పరీక్ష కేంద్రాల్లో 'గోడ గడియారాలు' పెట్టాల్సిందే, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TGBIE: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో గోడ గడియారాలను సిద్ధం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు కళాశాలల యాజమాన్యాలను ఆదేశించింది.

Wall Clocks in Inter Exam Halls: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో గోడ గడియారాలను (Wall Clock) ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. మార్చి 10న పరీక్ష ప్రారంభమయ్యే నాటికి అన్ని కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను సిద్ధం చేయాలని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జిల్లాల ఇంటర్ అధికారులను మార్చి 8న ఆదేశించారు. ఈ సారి అధికారులు ఇంటర్ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థుల గడియారాలను (స్మార్ట్ వాచ్, రిస్ట్ వాచ్‌) అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు సమయాన్ని సూచిస్తూ అరగంటకు ఒకసారి గంట కొడతారని, ఇన్విజిలేటర్లు కూడా సమయం చెబుతారని ఇటీవల బోర్డు కార్యదర్శి ప్రకటించారు. అయితే చాలా చోట్ల ఈ విధానాన్ని పాటించలేదు. దీంతో సమయం తెలియక విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పరీక్షలను సరిగ్గా రాయలేకపోయామని విద్యార్థులు తమ తల్లితండ్రులకు చెప్పడంతో వారు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 1,532 పరీక్షా కేంద్రాల్లోని అన్ని గదుల్లో వాల్ క్లాక్‌లను ఏర్పాటు చేయాలని కృష్ణ ఆదిత్య జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల(డీఐఈఓ)కు ఆదేశాలు జారీ చేశారు. 

ఒక్కో గోడ గడియారానికి రూ.100 కేటాయింపు..
ఒక్కో గోడ గడియారం కొనుగోలుకు రూ.100 చొప్పున మంజూరు చేయనున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. అయితే గోడ గడియారం రూ.100కు రాదని, అధికారులే పెద్ద మొత్తంలో వాటిని కొని పరీక్షా కేంద్రాలకు సరఫరా చేయాలని టీజీజేఎల్ఏ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సురేష్ ఒక ప్రకటనలో ఇంటర్ బోర్డును కోరారు.

ప్రశాంతంగా కొనసాగుతున్న పరీక్షలు..
తెలంగాణలో మార్చి 5న ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రథమ సంవత్సరం సంస్కృతం/తెలుగు/హిందీ/ఇతర, ఇంగ్లిష్ పరీక్షలు ముగియగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి 7న సంస్కృతం/తెలుగు/హిందీ/ఇతర పరీక్ష ముగిసింది. మార్చి 10న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆలోపే గడియారాలను సిద్ధం చేసుకోవాలని ఇంటర్ బోర్డు పరీక్ష కేంద్రాల కళాశాలలను ఆదేశించింది.

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే ప్రథమ సంవత్సరం ప్రధాన పరీక్షలు మార్చి 19తో ముగియనుండగా.. ఫస్టియర్ ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 24తో ముగుస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 25 వరకు నిర్వహించనున్నారు. అయితే సెకండియర్ ప్రధాన పరీక్షలు మార్చి 20తో ముగియనుండగా.. ఒకేషనల్, బ్రిడ్జి కోర్సు పరీక్షలు మార్చి 25తో ముగుస్తున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు 5 నిమిషాల్లోపు ఆలస్యమైనా అనుమతిస్తున్నారు. ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు.   

ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్
05.03.2025  బుధవారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-1
07.03.2025  శుక్రవారం ఇంగ్లిష్ పేపర్ పేపర్-1
11.03.2025  మంగళవారం మాథ్స్ పేపర్ 1ఎ, బోటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
13.03.2025  గురువారం మ్యాథ్స్ పేపర్ 1బి, జువాలజి పేపర్-1, హిస్టరీ పేపర్-1
17.03.2025  సోమవారం ఫిజిక్స్ , ఎకనామిక్స్
19.03.2025  బుధవారం కెమిస్ట్రీ , కామర్స్
21.03.2025  శుక్రవారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
24.03.2025  సోమవారం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1

ఇంటర్ సెకండియర్ పరీక్షల షెడ్యూలు..

పరీక్ష తేదీ వారం పేపర్
06.03.2025  గురువారం సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2
10.03.2025  సోమవారం ఇంగ్లిష్ పేపర్ పేపర్-2
12.03.2025  బుధవారం మాథ్స్ పేపర్ 2ఎ, బోటని పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
15.03.2025  శనివారం మ్యాథ్స్ పేపర్ 2బి, జువాలజి పేపర్-2, హిస్టరీ పేపర్-2
18.03.2025  మంగళవారం ఫిజిక్స్ , ఎకనామిక్స్
20.03.2025  గురువారం కెమిస్ట్రీ , కామర్స్
22.03.2025  శనివారం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు)
25.03.2025  మంగళవారం మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
 Pallavi Model Schools TOEFL YSS: భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
 భారత్‌లో TOEFL YSS ప్రోగ్రామ్‌ చేపట్టిన  మొదటి పాఠశాలగా పల్లవి మోడల్ స్కూల్స్
Telangana Education System: తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో విద్యా సంస్కరణలు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం అమలు: సీఎం రేవంత్ రెడ్డి
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
CM Chandrababu: ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
ఏపీ భవిష్యత్తు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అండ - ఏబీపీ ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానం ఇదే !
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Embed widget