search
×

High Income: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు - ఈ నెలాఖరు వరకే గోల్డెన్‌ ఛాన్స్‌!

High Interest Income: రెపో రేట్‌లో కోతకు అనుగుణంగా, ప్రస్తుతం, బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గించే మూడ్‌లో ఉన్నాయి. కొన్ని స్కీమ్‌ల్లో మాత్రం ఎక్కువ వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి.

FOLLOW US: 
Share:

Special Fixed Deposits With High Interest Rates: మన దేశంలో సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో స్థిరమైన వడ్డీ రాబడికి గ్యారెంటీ ఉంటుంది, పైగా పెట్టుబడికి భద్రత ఉంటుంది. కాబట్టి, ఎఫ్‌డీలను ప్రజలు విశ్వసిస్తారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించేందుకు చాలా బ్యాంక్‌లు ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను ‍‌(Special fixed deposit schemes) అమలు చేస్తున్నాయిు. వీటిలో మదుపు చేసిన డిపాజిటర్లకు సాధారణ వడ్డీ కంటే అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా, సీనియర్‌ సిటిజన్‌లకు స్పెషల్‌ ఎఫ్‌డీలతో ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. సాధారణంగా, స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌లు ప్రత్యేక కాల పరిమితితో ఉంటాయి. 

ఇటీవల, రిజర్వ్‌ బ్యాంక్‌ తన రెపో రేట్‌ను (RBI Repo Rate) తగ్గించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్‌లు కూడా టర్మ్‌ డిపాజిట్లు/ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతేకాదు, స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌లను నిలిపివేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ప్రత్యేక పథకాల్లో మదుపు చేసే అవకాశం ఇప్పటికీ ఉంది, ఈ పథకాలు 2025 మార్చి 31 వరకే అమల్లో ఉంటాయి. అంటే, ఈ నెలాఖరులోగా మీరు ఈ స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల్లో మదుపు చేస్తే ఎక్కువ వడ్డీ ఆదాయం పొందవచ్చు.

ఎక్కువ వడ్డీ ఆఫర్‌ చేస్తున్న స్పెషల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

ఎస్‌బీఐ అమృత్‌ వృష్టి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ‍‌(SBI Amrit Vrishti Fixed Deposit Scheme)
స్టేట్‌ బ్యాంక్‌ అమలు చేస్తున్న 444 రోజుల కాల వ్యవధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ఇది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తుంది. 

ఎస్‌బీఐ అమృత్‌ కలశ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ‍‌(SBI Amrit Kalash Fixed Deposit Scheme)
ఈ పథకం కాల వ్యవధి 400 రోజులు.  సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రాబడి ఉంటుంది.

ఐడీబీఐ ఉత్సవ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం (IDBI Bank Utsav Callable FD Scheme)
ఐడీబీఐ బ్యాంక్‌ అమలు చేస్తున్న ఎఫ్‌డీ స్కీమ్‌ ఇది. ఇందులో, 300 రోజులకు సాధారణ ప్రజలకు 7.05% వడ్డీ, సీనియర్‌ సిటిజన్లకు 7.55% వడ్డీ లభిస్తుంది. 
375 రోజుల టెన్యూర్‌ కోసం సాధారణ ప్రజలకు 7.25% వడ్డీ, సీనియర్‌ సిటిజన్లకు 7.75% వడ్డీ, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.90% వడ్డీని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది.
444 రోజుల టెన్యూర్‌ కోసం సాధారణ ప్రజలకు 7.35% వడ్డీ, సీనియర్‌ సిటిజన్లకు 7.85% వడ్డీ, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 8% వడ్డీని చెల్లిస్తోంది. 
ఐడీబీఐ బ్యాంక్‌ 555 రోజులు, 700 రోజుల కాల వ్యవధిల్లోనూ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాలను అమలు చేస్తోంది.

ఇండ్‌ సుప్రీం 300 డేస్‌ ఎఫ్‌డీ స్కీమ్‌ (IND Supreme 300 Days FD Scheme)
300 రోజుల కాల పరిమితితో, ఇండియన్‌ బ్యాంక్‌ అమలు చేస్తున్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం ఇది. ఈ స్కీమ్‌ కింద, సాధారణ ప్రజలకు 7.05% వడ్డీ, సీనియర్‌ సిటిజన్లకు 7.55% వడ్డీ, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 7.80% వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది.

ఇండ్‌ సూపర్‌ 400 డేస్‌ ఎఫ్‌డీ స్కీమ్‌ (IND Super 400 Days FD Scheme)
ఇండియన్‌ బ్యాంక్‌ అమలు చేస్తున్న 400 రోజుల కాల వ్యవధి డిపాజిట్‌ స్కీమ్‌ ఇది. దీనిలో సాధారణ ప్రజలకు 7.30% వడ్డీ, సీనియర్‌ సిటిజన్లకు 7.80% వడ్డీ, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 8.05% వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఐటీ అధికారుల చేతికి బ్రహ్మాస్త్రం - మీ అకౌంట్స్‌ అన్నీ చెక్‌ చేసే 'సూపర్‌ పవర్‌', బెండ్‌ తీస్తారిక! 

Published at : 07 Mar 2025 11:16 AM (IST) Tags: FDs 2025 High Interest Rates Special Fixed Deposits High interest income

ఇవి కూడా చూడండి

Loan Against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే ఈజీగా లోన్‌, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు

Loan Against FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఉంటే ఈజీగా లోన్‌, ఎఫ్‌డీని రద్దు చేసే పని లేదు

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్‌ న్యూస్‌, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి

Interest Rates Reduced: లోన్ తీసుకునేవాళ్లకు గుడ్‌ న్యూస్‌, ఈ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి

Gold-Silver Prices Today 11 April: పసిడి రికార్డ్‌, 97,000 దాటిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 11 April: పసిడి రికార్డ్‌, 97,000 దాటిన రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్‌, సెన్సెక్స్‌ 1000pts జంప్‌ - గ్లోబల్‌ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు

Stock Market Opening: భారతీయ మార్కెట్లలో జోష్‌, సెన్సెక్స్‌ 1000pts జంప్‌ - గ్లోబల్‌ మార్కెటు డీలా పడ్డా బేఖాతరు

టాప్ స్టోరీస్

Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !

Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !

Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ

Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ

AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు

AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు

IPL2025 RCB VS RR Result Update: ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ

IPL2025 RCB VS RR Result Update: ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ