Bad luck Bhaskar: బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
Fugitive banker: బ్యాంకు నుంచి వంద కోట్లు తీసుకుని అమెరికాకు వెళ్లి సెటిలైపోతాడు లక్కీ భాస్కర్ సినిమాలోని హీరో. అహ్మదాబాద్ కు చెందిన ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. కానీ 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చేశారు.

Fugitive banker brought back to India after 23 year chase: బ్యాంకులో ఉద్యోగి .. ఆ బ్యాంకు రూల్స్ లో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని వంద కోట్లు సంపాదించుకుని దొరికిపోయే సమయంలో వాటన్నింటితో అమెరికాలో హోటల్ కొనుక్కుని అక్కడ సెటిలైపోతాడు. ఇది సుఖాంతమైన కథ. అహ్మదాబాద్‌లోని ఓ వ్యక్తి 23 ఏళ్ల కిందటే ఈ పని చేశాడు. ఇప్పటి వరకూ ఆ డబ్బుతో సుఖంగానే ఉన్నా ఇప్పుడు బయటకు రాక తప్పలేదు. దొరికిపోక తప్పలేదు.
వీరేంద్రభాయ్ పటేల్ .. 23 ఏళ్ల కిందట గుజరాత్‌లో బాగా వినిపించిన పేరు. ఆయన ఆనంద్‌లోని చరోతర్ నాగ్రిక్ సహకారి బ్యాంకు డైరక్టర్ గా ఉండేవారు. అంతా బాగా జరుగుతోందని నమ్మించి రూ. 77 కోట్ల రూపాయలను తన ఖాతాలో జమ చేసుకున్నారు. అ డబ్బుల్ని అమెరికా తరలించుకున్నారు. తర్వాత ఆయన కూడా వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోయిన తర్వాతనే అసలు విషయం తెలిసింది.
అయినా ఆయనపై నేరపూరిత విశ్వాస ద్రోహం, ఫోర్జరీ, కుట్ర ఆరోపణలతో కేసులు పెట్టారు. 2004లో CBI అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ నోటీసును జారీ చేసింది. అయినప్పటికీ అతను దాదాపు 20 సంవత్సరాలు అమెరికాలో ఎవరి కంటబడకుండా ఉన్నారు. పట్టుబడకుండా తప్పించుకుని తిరిగాడు.కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితులతో ఆయన వెనక్కి తిరిగి రాక తప్పలేదు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే అరెస్టు చేశారు. రెడ్ నోటీసు ఉండటంతో ఆయనకు సంబంధించిన సమాచారం అక్కడ ఫ్లైట్ ఎక్కగానే ఇక్కడ తెలిసిపోయింది.
ఆర్థిక నేరస్థులు సరిహద్దులు దాటడం ద్వారా న్యాయం నుండి తప్పించుకోలేరని ఈ కేసు బలమైన సందేశాన్ని పంపుతుందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. భారత అధికారులు తమ ప్రపంచ ప్రయత్నాలను విస్తరిస్తున్నందున ..మరింత మంది ఆర్థిక పారిపోయినవారని తీసుకు వస్తామంటున్నారు.
Also Read: 27 ఏళ్ల కింద వదిలేసిపోయిన భర్తను కుంభమేళాలో చూసిన భార్య - అఘోరిగా ఉన్న ఆ భర్త ఏం ఏం చేశాడో తెలుసా ?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

