Fruits for Period Cramp Relief : పీరియడ్స్‌లో ఉన్నారా? అయితే ఈ పండ్లు తినేయండి, నొప్పి తగ్గడంతో పాటు మరెన్నో బెనిఫిట్స్
Period Cramps : పీరియడ్ క్రేవింగ్స్‌ని తగ్గించి.. నెలసరి సమయంలో వచ్చే నొప్పిని దూరం చేసుకోవడానికి కొన్ని పండ్లు డైట్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఫ్రూట్స్ ఏంటి?

Say Goodbye to Period Cramps : పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి, తిమ్మిరితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఫుడ్ కొన్ని ఫుడ్ క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే పీరియడ్స్‌లో ఉన్నప్పుడు కొన్ని ఫ్రూట్స్ తింటే.. క్రేవింగ్స్ కంట్రోల్ అవ్వడంతో పాటు.. నొప్పి, తిమ్మరి నుంచి ఉపశమనం ఉంటాయని పలు అధ్యయనాలు తేల్చాయి. అసలు పీరియడ్స్ సమయంలో క్రాంప్స్ నుంచి రిలీఫ్ అందించే పండ్లు ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం.
బొప్పాయి
బొప్పాయిని పీరియడ్స్ సమయంలో తీసుకోకూడదని చాలామంది అనుకుంటారు. కానీ నెలసరిలో ఉన్నప్పుడు బొప్పాయి తింటే చాలామంచిదని నిపుణులు చెప్తున్నారు. దీనిలోని విటమిన్ ఏ, పపైన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి పీరియడ్ సమయంలో వచ్చే హార్మోనల్ సమస్యలను దూరం చేస్తాయి. రోజుకు ఒక కప్పు లేదా 150 గ్రాముల బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిదట.
యాపిల్స్
ఫైబర్ పుష్కలంగా ఉండే యాపిల్స్‌ని పీరియడ్ సమయంలో తింటే.. మెరుగైన జీర్ణక్రియ అందుతుంది. కడుపు ఉబ్బరం తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. కాబట్టి వీటిని హెల్తీ స్నాక్‌గా తీసుకోవచ్చు. రోజుకో యాపిల్ తింటే మంచి ప్రయోజనాలు అందుతాయి.
అరటిపండ్లు
అరటిపండ్లలోని బోరాన్ పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిరిని తగ్గిస్తుంది. అంతేకాకుండా అరటిలోని పొటాషియం, విటమిన్ బి6 కూడా అధికంగా ఉంటాయి. ఇవి కండరాలకు విశ్రాంతిని ఇచ్చి.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. మూడ్ స్వింగ్స్‌ని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో రోజూ ఓ అరటిపండును తీసుకోవాలని సూచిస్తున్నారు.
పైనాపిల్
పైనాపిల్స్లోని ఎంజైమ్ములు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. దీనివల్ల కండరాలకు విశ్రాంతి అంది.. నొప్పి నుంచి ఉపశమనం అందుతుందని చెప్తున్నారు నిపుణులు. రోజుకు 150 గ్రాముల తాజా పైనాపిల్ తింటే.. చాలామంచిదని సూచిస్తున్నారు.
పుచ్చకాయ
పీరియడ్ క్రాంప్స్ నుంచి రిలీఫ్ కావాలంటే డైట్లో పుచ్చకాయ ఉండాల్సిందేని చెప్తున్నారు. ఇది శరీరానికి హైడ్రేషన్‌ని అందించడమే కాకుండా.. దీనిలోని మెగ్నీషియం కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. క్రాంప్ కంట్రోల్ అవుతాయి. డేట్లో ఉన్నప్పుడు రోజుకు 1 లేదా 2 కప్పుల పుచ్చకాయను తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
నారింజ
నారింజల్లోని విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలకు విశ్రాంతిని అందించి.. మూడ్‌ని మెరుగుపరుస్తాయి. కాబట్టి రోజుకు 1 లేదా 2 నారింజలు తింటే మంచిదని చెప్తున్నారు. పీరియడ్స్‌లో కనీసం ఆరెంజ్ జ్యూస్ తాగితే మంచిదని చెప్తున్నారు.
ఇవే కాకుండా బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి కూడా పీరియడ్ సమయంలో తింటే మంచిఫలితాలు ఇస్తాయి. అవకాడో కూడా పీరియడ్ క్రాంప్స్ నుంచి ఉపశమనం ఇస్తుంది. ఈ పండ్లు కేవలం పీరియడ్ నొప్పిని దూరం చేయడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. శరీరానికి పోషకాలు అందుతాయి. కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా వీటిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవచ్చు.
Also Read : పీరియడ్స్‌లో ఆ ఫుడ్స్ తింటున్నారా? స్వీట్లు, ఐస్‌క్రీమ్, చిప్స్, స్పైసీఫుడ్స్.. వామ్మో అవి తింటే అంత డేంజరా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

