మఖానా అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. అందుకే దీనిని చాలామంది హెల్తీ స్నాక్‌గా తీసుకుంటారు. మరి పీరియడ్స్ సమయంలో మఖానాను తింటే ఆరోగ్యానికి మంచిదా? నష్టాలు కూడా ఉంటాయా ఇప్పుడు తెలుసుకుందాం. మఖానాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే ఎనిమియాను ఇది దూరం చేస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు పీరియడ్స్ సమయంలో వచ్చే మంటను, ఇన్ఫ్లమేషన్, క్రాంప్స్‌ను తగ్గిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే మలబద్ధకం సమస్యలను ఇది దూరం చేస్తుంది. మఖానాలోని మెగ్నీషియం, పొటాషియం యుట్రైన్ కండరాలను రిలాక్స్ చేసి పీరియడ్ క్రాంప్స్‌ను కంట్రోల్ చేస్తాయి. హార్మోనల్ సమస్యలను దూరం చేసుకోవడంలో మఖానా మంచి ఫలితాలు ఇస్తాయి. అలెర్జీలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనలతో వీటిని డైట్లో చేర్చుకోవాలి. మఖానాలోని ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు తక్కువగా తీసుకుంటే మంచిది. కొంచెం నూనెలో మాఖానా వేసి.. ఉప్పు, మసాలా వేసి.. క్రంచీ స్నాక్‌గా వీటిని తీసుకోవచ్చు.