అన్వేషించండి

Dwadash Aditya Worship : అనారోగ్యం దరిచేరనివ్వని ద్వాదశ ఆదిత్యుల ఆరాధన - ఎవరా 12 మంది ఆదిత్యులు!

Ratha Saptami 2025: ప్రత్యక్ష నారాయణుడి ఆరాధనకు ప్రతి రోజూ మంచిదే. ఏడాదిలో మాఘమాసం మరింత ప్రత్యేకం..ఆదివారం ఇంకా విశిష్టమైనది. సూర్యారాధనలో భాగంగా ద్వాదశ ఆదిత్యులను పూజిస్తారు. ఎవరా ద్వాదశ ఆదిత్యులు

Dwadash Aditya Worship : అదితి, కశ్యపులు  12మంది పుత్రులను ద్వాదశ ఆదిత్యులు అంటారు. ఏడాదిలో 12 నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో ప్రత్యక్షభగవానుడిని అభివర్ణిస్తారు.

మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణన స్పష్టంగా ఉంటుంది.  

ద్వాదశాదిత్యులు పేర్లు  ... ఏ నెలలో ఏ పేరుతో సంచారం

ధాత - చైత్ర మాసం
అర్యముడు - వైశాఖ మాసం
మిత్రుడు - జ్యేష్ఠ మాసం
వరుణుడు - ఆషాఢ మాసం
ఇంద్రుడు - శ్రావణ మాసం
వివస్వంతుడు- భాద్రపద మాసం
త్వష్టా - ఆశ్వయుజ మాసం
విష్ణువు - కార్తీక మాసం
అంశుమంతుడు - మార్గశిర మాసం
భగుడు - పుష్య మాసం
పూషా - మాఘ మాసం
పర్జన్యుడు - ఫాల్గుణ మాసం

నిత్యం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పింది ద్వాదశ ఆదిత్యులలో ఒక్కో పేరు చెబుతూ సూర్య నమస్కారాలు చేస్తారు. నిత్యం ఇది అనుసరించేవారికి అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రవచనం. 

Also Read: ఈ ఏడాది వసంతపంచమి ఎప్పుడొచ్చింది .. విశిష్టత ఏంటి , సరస్వతీ దేవి పూజా విధానం ఇదే!

ద్వాదశాదిత్య ధ్యాన శ్లోకాలు (Dvadasa Aditya Dhyana Slokas)

ధాతా 
ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే |
పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్యమీ ||
ధాతా శుభస్య మే దాతా భూయో భూయోఽపి భూయసః |
రశ్మిజాలసమాశ్లిష్టః తమస్తోమవినాశనః ||
 
అర్యమ 
అర్యమా పులహోఽథౌజాః ప్రహేతి పుంజికస్థలీ |
నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవమ్ ||
మేరుశృంగాంతరచరః కమలాకరబాంధవః |
అర్యమా తు సదా భూత్యై భూయస్యై ప్రణతస్య మే ||

మిత్రః 
మిత్రోఽత్రిః పౌరుషేయోఽథ తక్షకో మేనకా హహః |
రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమీ ||
నిశానివారణపటుః ఉదయాద్రికృతాశ్రయః |
మిత్రోఽస్తు మమ మోదాయ తమస్తోమవినాశనః ||

వరుణః 
వసిష్ఠో హ్యరుణో రంభా సహజన్యస్తథా హుహుః |
శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమీ ||
సూర్యస్యందనమారూఢ అర్చిర్మాలీ ప్రతాపవాన్ |
కాలభూతః కామరూపో హ్యరుణః సేవ్యతే మయా ||

Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!

ఇంద్రః 
ఇంద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాఽంగిరాః |
ప్రమ్లోచా రాక్షసోవర్యో నభోమాసం నయంత్యమీ ||
సహస్రరశ్మిసంవీతం ఇంద్రం వరదమాశ్రయే |
శిరసా ప్రణమామ్యద్య శ్రేయో వృద్ధిప్రదాయకమ్ ||

వివస్వాన్ 
వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః |
అనుమ్లోచాః శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ ||
జగన్నిర్మాణకర్తారం సర్వదిగ్వ్యాప్తతేజసమ్ |
నభోగ్రహమహాదీపం వివస్వంతం నమామ్యహం ||

త్వష్టా 
త్వష్టా ఋచీకతనయః కంబళాఖ్యస్తిలోత్తమా |
బ్రహ్మాపేతోఽథ శతజిత్ ధృతరాష్ట్ర ఇషంభరా ||
త్వష్టా శుభాయ మే భూయాత్ శిష్టావళినిషేవితః |
నానాశిల్పకరో నానాధాతురూపః ప్రభాకరః |

విష్ణుః 
విష్ణురశ్వతరో రంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్ |
విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ ||
భానుమండలమధ్యస్థం వేదత్రయనిషేవితమ్ |
గాయత్రీప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహమ్ ||

అంశుమన్ 
అథాంశుః కశ్యపస్తార్‍క్ష్య ఋతసేనస్తథోర్వశీ |
విద్యుచ్ఛత్రుర్మహాశంఖః సహోమాసం నయంత్యమీ ||
సదా విద్రావణరతో జగన్మంగళదీపకః |
మునీంద్రనివహస్తుత్యో భూతిదోఽంశుర్భవేన్మమ ||

భగః 
భగః స్ఫూర్జోఽరిష్టనేమిః ఊర్ణ ఆయుశ్చ పంచమః |
కర్కోటకః పూర్వచిత్తిః పౌషమాసం నయంత్యమీ ||
తిథి మాస ఋతూనాం చ వత్సరాఽయనయోరపి |
ఘటికానాం చ యః కర్తా భగో భాగ్యప్రదోఽస్తు మే ||

పూష 
పూషా ధనంజయో వాతః సుషేణః సురుచిస్తథా |
ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమీ |
పూషా తోషాయ మే భూయాత్ సర్వపాపాఽపనోదనాత్ |
సహస్రకరసంవీతః సమస్తాశాంతరాంతరః ||

పర్జన్యః 
క్రతుర్వార్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్ తథా |
విశ్వశ్చైరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమీ ||
ప్రపంచం ప్రతపన్ భూయో వృష్టిభిర్మాదయన్ పునః |
జగదానందజనకః పర్జన్యః పూజ్యతే మయా ||

ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః|
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||

Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Viral Video: స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
స్మిత్ రిటైర్మెంట్‌పై కోహ్లీకి ముందే హింట్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
SLBC Tunnel News: ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
ఎస్‌ఎల్‌బీసీ రెస్య్కూ ఆపరేషన్‌కు మట్టిదిబ్బల గండం- అక్కేడ కార్మికులు ఉన్నట్టు అనుమానం!
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
Tesla Cars In India: టెస్లా కార్లను ఇండియాలోనే కొనొచ్చు, ఇంపోర్ట్‌ అక్కర్లేదు - ఫస్ట్‌ షోరూమ్‌ ఓపెనింగ్‌!
టెస్లా కార్లను ఇండియాలోనే కొనొచ్చు, ఇంపోర్ట్‌ అక్కర్లేదు - ఫస్ట్‌ షోరూమ్‌ ఓపెనింగ్‌!
Holi 2025 Date : హోలీ 2025లో మార్చి 14న జరుపుకోవాలా? 15వ తేదీన చేసుకోవాలా? హోలీ, హోలీకా దహనం డిటైల్స్ ఇవే
హోలీ 2025లో మార్చి 14న జరుపుకోవాలా? 15వ తేదీన చేసుకోవాలా? హోలీ, హోలీకా దహనం డిటైల్స్ ఇవే
Urvashi Rautela: ఊర్వశీ.. నీకన్నా ఉర్ఫీనే బెటర్ - సోషల్ మీడియాలో ఏకి పారేస్తోన్న నెటిజన్లు
ఊర్వశీ.. నీకన్నా ఉర్ఫీనే బెటర్ - సోషల్ మీడియాలో ఏకి పారేస్తోన్న నెటిజన్లు
Embed widget