అన్వేషించండి

SSMB 29 TITLE: ఏంటీ NT NINE..? మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ

SSMB 29: మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారా..? NT NINE అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేశారా.. ప్రియాంక చోప్రా- రాజమౌళి ఫోటోలతో హింట్ ఇస్తున్నారా.. ?సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే నడుస్తోంది.

NT NINE: రాజమౌళి-SSMB 29 సినిమాపై ఇప్పుడు బజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. RRR సినిమా రిలీజ్ అయ్యి దాదాపు మూడేళ్లు అవుతున్నా... ఇంత వరకూ కొత్త సినిమా గురించి కొంచం కూడా లీక్ ఇవ్వకుండా ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు రాజమౌళి. RRR  కంటే ముందే మహేష్‌తో సినిమా అని అనౌన్స్ చేశారు కానీ ఎలాంటి సినిమా.. ఇంకా ఎవరెవరు ఉంటారన్న విషయాలు ఏమాత్రం కూడా బయటకు రాకుండా అంతకంతకు ఉత్కంఠ పెంచుతూ వచ్చారు. ఈ మధ్యనే  తెలుగు సినిమాల్లో ఉండే ట్రెండ్ కి విరుద్ధంగా ఆనఫిషియల్‌గా అఫీషియల్ షూటింగ్ ప్రారంభించేశారు. హాలీవుడ్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకచోప్రా ను ఆన్ బోర్డింగ్ చేశారు. ఇలా ఒక్కో విషయం లీక్ అవుతూ వస్తోంది కానీ అఫీషియల్‌గా ఇంతవరకూ ఒక్కమాట కూడా చెప్పడం లేదు.

ఇంటర్నెట్‌లో  ప్రియాంక- రాజమౌళి ఫోటోలు

ప్రియాంకచోప్రా హైదరాబాద్ వచ్చినప్పుటి నుంచి ఈ కొత్త సినిమా గురించి ఆన్‌లైన్‌లో డిస్కషన్ పెరిగింది. అయితే ఇవాళ ఉన్నట్టుండి రాజమౌళి- ప్రియాంకచోప్రా.. మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీళ్లు ముగ్గురూ RRR స్పెషల్ స్క్రీనింగ్ చూశారు అంటూ ప్రచారం మొదలైంది. అంతవరకూ ఓకే కానీ.. వీళ్ల ముగ్గురు  దుస్తులపైన NT NINE అనే లేబుల్ ఒకటి కనిపించింది.  అదే ప్రతి ఒక్కరినీ అట్రాక్ట్ చేసింది. చాలా మంది మహేష్ బాబు అభిమానలు ఆ పిక్స్‌ను షేర్ చేయడం మొదలు పెట్టారు.

SSMB 29 TITLE: ఏంటీ NT NINE..? మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ

NT NINE అనేది SSMB 29 టైటిలా...?

అసలే సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు లేక ఆకలిమీదున్న ఫ్యాన్స్‌కు ఈ ఫోటోలు, వాళ్ల దుస్తులపైన ఉన్న లేబుల్ మంచి ఫీడ్ ఇచ్చాయి. అది ఈ సినిమా వర్కింగ్ టైటిల్ అని.. ఆ సినిమా టైటిల్ పేరును పాపులర్ చేయడానికి వీళ్లు కావాలని ఆ లేబుల్ వేసుకున్నారని ఆన్‌లైన్ ఫోరమ్స్‌లో డిస్కషన్ మొదలైపోయింది. కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ తమ ప్రొఫైల్ పిక్‌లను ఈ టైటిల్ కు మార్చేసుకున్నారు. మహేష్‌బాబు రాజమౌళి కొత్త సినిమా టైటిల్ ఇదే అనే స్థాయిలో ఆన్‌లైన్‌లో ప్రచారం జరిగింది. ఇదే లేబుల్‌తో ఉన్న ఫోటోలను South Indian International Movie Awards- SIIMA హ్యాండిల్ కూడా షేర్ చేసింది. దీంతో ఎక్కువమంది ఇది కొత్త టైటిల్ అని నమ్మారు.

SSMB 29 TITLE: ఏంటీ NT NINE..? మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ

NT NINE అంటే అదా.. ?

ఎక్కువ మంది నమ్మారు అంటున్నారు.. నిజం కాదా అంటే.. కాదు. టైటిలే కాదు.. అసలు ఆ ఫోటోలే నిజం కాదు. ఆ ఫోటోలో ఉన్నట్లుగా రాజమౌళి- ప్రియాంకచోప్రా- కీరవాణి కలిసి ఉన్నారు కానీ వాళ్ల డ్రెస్‌లపై ఉన్న లేబుల్ మాత్రం ఫేక్. తెలుగులోని ఓ ట్రోల్ పేజ్ క్రియేటర్ తన పేజ్ ను అక్కడ ప్రమోట్ చేశారు. నా ట్రోల్స్ నేనే వేసుకుంటా అనే దానికి సంక్షిప్త రూపమే ఈ NT NINE ( Naa Trolls Nine). మనోడు చేసిన పనితో అంతా అదే నిజమని నమ్మి.. అప్పటికే తమ ప్రొఫైల్స్ కూడా మార్చేసుకున్నారు.

ఇంతకీ ఫోటోలు ఎప్పటివి..?

ఆ ఫోటోలు నిజమే కానీ ఇప్పటివి కాదు. ప్రియాంక చోప్రా రాజమౌళి సినిమాలో చేస్తుండటంతో... ఆ ఫోటోలు బయటకు రాగానే ఇవన్నీ లేటెస్ట్ ఫోటోలు అని చాలా మంది పొరబడ్డారు. కానీ  ఈ ఫోటోలన్నీ కూడా మూడేళ్ల కిందటివి. RRR స్పెషల్ స్క్రీనింగ్ యుఎస్‌లో జరిగినప్పుడు.. ప్రియాంక చోప్రా అటెండ్ అయ్యారు. అప్పుడు షో తర్వాత జరిగిన కార్యక్రమాన్ని తనే హోస్ట్ చేశారు. “ఇంత గొప్ప భారతీయ చిత్రానికి నేను చేయగలుగుతున్న ప్రచారం ఇది” అని ఆవిడ అప్పుడు తన Instagramలో ఈ ఫోటోలు షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలు బయటకు తీసి వాటికి లేబుల్ వేసి.. ఇంటర్నెట్‌లో రచ్చ లేపారు.

ఎస్‌ఎస్ రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB 29 కు  ఇండియాలో అత్యధికమంది ఎదురుచూస్తున్న చిత్రంగా గుర్తింపు ఉంది. ఈ సినిమాకు సంబంధించి మూడేళ్లుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరిగి.. ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లినా కానీ దీనికి సంబంధించి ఏ చిన్న సమాచారం కూడా బయటకు రాకుండా చూస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్నారని ఆవిడ హైదరాబాద్‌లో ఉంటున్నారు కాబట్టి నిర్థారిస్తున్నారు కానీ ఇంతవరకూ మూవీ యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహేష్‌బాబు, ప్రియాంకచోప్రాతో పాటు.. ప్రతినాయకుడిగా పృథ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ప్లేస్‌లోకి జాన్ అబ్రహం వచ్చారన్నది తాజా సమాచారం. రాజమౌళి స్వయంగా ప్రకటించే వరకూ మీడియాలో వచ్చేవన్నీ ఊహాగానాలే. అందుకే  చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా కూడా బాగా చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget