The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Maruthi Reaction : నెగిటివిటీ, తనపై వస్తోన్న ట్రోలింగ్స్‌పై 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్ట్ అయ్యారు. నెగిటివ్ కామెంట్స్ వల్ల ఎనర్జీ వస్తుందని... అందుకే వారందరికీ థాంక్స్ అని చెప్పారు.

Director Maruthi Reaction On Sandeep Raj Tweets : ఫేమస్ డైరెక్టర్ మారుతి తనపై వస్తోన్న ట్రోలింగ్స్, విమర్శలు, నెగిటివ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. అలాగే, సోషల్ మీడియాలో నెగిటివిటీని పట్టించుకోవద్దని డైరెక్టర్ సందీప్ రాజ్‌కు సలహా ఇచ్చారు. యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'మోగ్లీ' ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ నెల 12నే రిలీజ్ కావాల్సి ఉండగా అదే రోజున బాలయ్య 'అఖండ 2' వస్తుండడంతో ఒక రోజుకు వాయిదా వేశారు. దీనిపై సందీప్ ఎమోషనల్ అయ్యారు.
'అఖండ 2' ఈ నెల 5నే రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. అన్నీ ఇష్యూస్ క్లియర్ అయ్యి ఈ నెల 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే, చాలా రోజుల ముందే రోషన్ 'మోగ్లీ' 12న రిలీజ్ అనౌన్స్ చేశారు. దీంతో డైరెక్టర్ సందీప్ ట్విట్టర్ వేదికగా... 'నేను చాలా దురదృష్టవంతుడిని' అంటూ పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. కొందరు ఆయనకు సపోర్ట్‌గా కామెంట్స్ చేశారు.
'అఖండ 2'... అది చాలా అదృష్టం
దీనిపైనే తాజాగా 'మోగ్లీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి రియాక్ట్ అయ్యారు. 'సందీప్ చాలా పాజిటివ్ పర్సన్. కానీ కొన్ని చిన్న విషయాలకే రీసెంట్‌గా ఫ్రస్టేట్ అయిపోతున్నాడు. 'మోగ్లీ' రిలీజ్ టైంకు బాలయ్య 'అఖండ 2' రావడం చాలా అదృష్టం. ఆయన రాబట్టే మోగ్లీ సినిమా తెలియని వాళ్లకు కూడా తెలిసింది. లేకుంటే కొంతమంది వరకే తెలిసేది. శంకర్ దాదా MBBSతో పాటు ఆనంద్ సినిమా వచ్చింది. అప్పుడు ఆ మూవీ చాలా మందికి తెలిసింది. అందువల్లే ఈ రోజు శేఖర్ కమ్ముల గొప్ప డైరెక్టర్ మనకు దొరికారు.
అలాగే, సందీప్ కూడా బాలయ్య బాబు బ్లెస్సింగ్‌తో స్టార్ డైరెక్టర్‌గా ఎదగాలని కోరుకుంటున్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. మీలో టాలెంట్ ఉంటే విశ్వప్రసాద్ గారిని మీట్ కావొచ్చు. ఆయనకు సినిమాలు తీయాల్సిన అవసరమే లేకపోయినా ఇండస్ట్రీకి రుణ పడినట్లు సినిమాలు తీస్తూ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు. రోషన్ చాలా టాలెంటెడ్. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. రోషన్ వెనుకాల ఉన్న శక్తి సుమగారే.' అని అన్నారు.
Also Read : పవర్ లిఫ్టింగ్‌పై ట్రోలింగ్స్... ఆ మెడల్ వారికి ఆన్సర్ - నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్
నెగిటివ్ కామెంట్స్‌పై...
అలాగే, '3 రోజెస్' వెబ్ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్స్‌పై మారుతి రియాక్ట్ అయ్యారు. నటి ప్రగతికి సపోర్ట్ చేస్తూనే... తనపై వచ్చే కామెంట్స్‌పై స్పందించారు. 'మేడమ్... అందరూ ట్రోల్స్ చేస్తున్నారని ఏమీ అనుకోవద్దు. వారు అలా అనకుంటే మీరు గోల్డ్ మెడల్ సాధించేవారు కాదు. ట్రోలర్స్ వారి పనులన్నీ మానుకొని నెగిటివిటీని పంచుతున్నారు. నాలుగు బూతులు, నాలుగు తిట్లు మాత్రమే ఉంటాయి.
ఎవరైనా తిడితే దాన్ని ఎనర్జీగా మార్చుకోవాలి. మీరు కూడా మిమ్మల్ని తిట్టే వారిని వెతుక్కోండి. ట్రోలర్స్ మాకు ఎనర్జీ ఇస్తూ ఉంటే మేం ఎదుగుతూనే ఉంటాం. మీరు మాత్రం అక్కడే ఉంటారు. అందుకే నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి థాంక్స్.' అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.





















