అన్వేషించండి

Pragathi : పవర్ లిఫ్టింగ్‌పై ట్రోలింగ్స్... ఆ మెడల్ వారికి ఆన్సర్ - నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్

Pragathi Reaction : తనపై వస్తోన్న ట్రోలింగ్స్, కామెంట్స్‌కు సీనియర్ నటి ప్రగతి రియాక్ట్ అయ్యారు. దేశానికి నేను తీసుకొచ్చిన మెడల్ అలాంటి వారికి ఆన్సర్ అని అన్నారు.

Actress Pragathi Reaction About Trollings On Her Gym Practices With Saree : టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఓ వైపు నటనలోనూ, మరోవైపు పవర్ లిఫ్టింగ్‌లోనూ ప్రతిభ చూపుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో పాటు 4 పతకాలు సాధించారు. తాజాగా ఆమె తనపై వస్తోన్న ట్రోలింగ్స్, జిమ్‌లో చీర కట్టుకుని ఎక్సర్‌సైజ్ చేసిన దానిపై వస్తోన్న కామెంట్లపై రియాక్ట్ అయ్యారు. 

తుదిశ్వాస వరకూ సినిమానే...

తాను మీడియాకు దూరంగా ఉంటానని... ఈవెంట్లలోనూ మాట్లాడాలంటే భయమని అన్నారు ప్రగతి. మాట్లాడిన తర్వాత రోజు నుంచే ట్రోలింగ్‌కు గురవుతాననే ఆందోళన ఉంటుందని చెప్పారు. 'మూవీస్ మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తుందని అంతా అంటున్నారు. నేను సినిమా లేకుంటే బతకలేను. నా తుదిశ్వాస వరకూ నేను యాక్టింగ్ చేస్తూనే ఉంటాను. కాస్త గ్యాప్ ఇచ్చాను అంతే. తర్వాత మూవీలో విలన్‌గా చేస్తున్నా.

ఆ గ్యాప్‌లో ఎక్కడైనా తగ్గుతానేమోనని ఆ ఎనర్జీని పవర్ లిఫ్టింగ్‌కు టర్న్ చేశాను. ఈ రోజు మన దేశ జెండా వేసుకుని సిల్వర్ మెడల్ ఇంటికి తెచ్చాను. ' అని చెప్పారు.

Also Read : అఖండ 2 రిలీజ్ టీజర్... త్రిశూలం పట్టిన శివునిలా బాలయ్య - దిష్టి తీసే షాట్ సూపరంతే

ట్రోలింగ్స్‌కు ఇదే నా ఆన్సర్

పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు 'ఈ వయసులో అవసరమా?' అంటూ చాలామంది కామెంట్స్ చేశారని ప్రగతి తెలిపారు. 'జిమ్‌కు జిమ్ డ్రెస్సే వేసుకోవాలి. చీరలు, చుడీదార్స్ వేసుకోలేం. ఇంత అసహ్యంగా ఫీల్ చేస్తున్నారే? నేనేమైనా తప్పు చేస్తున్నానా? అనే ఫీలింగ్ నాకు కలిగింది. స్టార్టింగ్‌లో ట్రోలింగ్స్ వల్ల చాలా బాధ పడ్డా. ఆ కామెంట్స్, ట్రోలింగ్స్‌కు ఈ రోజు ఆన్సర్ వచ్చిందనే అనుకుంటా. ఏషియన్ గేమ్స్‌లో నాకు వచ్చిన మెడల్‌ను ఇండస్ట్రీలో ప్రతీ మహిళా ఆర్టిస్టుకు డెడికేట్ చేస్తున్నా.

సోషల్ మీడియాలో ఎలాంటి ఆలోచన లేకుండానే కామెంట్స్ చేసేస్తుంటారు. మనింట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు. అది ఒకటి అందరూ ఆలోచించుకోవాలి. సినిమాలో నేను భాగం అయినందుకు చాలా గర్వపడుతున్నా. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఓ మహిళా ఆర్టిస్ట్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఎవరికి ఏమీ ఇవ్వకపోయినా కొంచెం మర్యాద ఇవ్వండి. ఆర్టిస్టులకు రెస్పెక్ట్ ఇవ్వండి.' అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యారు.

వారిద్దరూ విష్ చేశారు

ఈ మెడల్ సాధించినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు వ్యక్తులు తనకు విష్ చేశారని చెప్పారు ప్రగతి. 'మంచు లక్ష్మి, బ్రహ్మానందం ఇద్దరూ నాకు విష్ చేశారు. నేను యాక్ట్ చేయని హీరో, హీరోయిన్ లేరు. నేను వర్క్ చేయని పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేరు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు కూడా చేశాను. నేను ఓ చిన్న యాక్టర్. SKN, మారుతి గారితో వర్క్ చేయలేదు. ఈ రోజు నన్ను పిలిచి సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు. నేను ఏదో సాధించాను అనే ఓ గుర్తింపు నాకు ఇచ్చారు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.' అని చెప్పారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నిరుపేదలకు గుడ్‌న్యూస్.. లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
నిరుపేదలకు గుడ్‌న్యూస్.. లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
Indian Railway Rules: వేరే కోచ్‌లో ఎక్కి టీటీఈకి దొరికిపోతే ఏం చేస్తారు ? మీ సీటు ఇతరులకు ఎప్పుడు కేటాయిస్తారు
వేరే కోచ్‌లో ఎక్కి టీటీఈకి దొరికిపోతే ఏం చేస్తారు ? మీ సీటు ఇతరులకు ఎప్పుడు కేటాయిస్తారు
NEET UG 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే
NEET UG 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే
Vishnu Manchu : విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
Advertisement

వీడియోలు

Naga Vamsi about Vishwak Sen | విశ్వక్ పై నాగవంశీ కామెంట్స్ | ABP Desam
T20 World Cup India vs Pakistan | ఫిబ్రవరి 15న భారత్ - పాక్ మ్యాచ్
Gambhir Master Plan T20WC Ind vs USA | భారత్ విజయం వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్
Mohammed Siraj unexpected entry in India vs US T20WC | వరల్డ్ కప్‌లో మియా భాయ్ మేజిక్
T20 World Cup India vs USA | అమెరికాపై టీమిండియా ఘన విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నిరుపేదలకు గుడ్‌న్యూస్.. లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
నిరుపేదలకు గుడ్‌న్యూస్.. లక్ష టిడ్కో ఇళ్లు పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
Indian Railway Rules: వేరే కోచ్‌లో ఎక్కి టీటీఈకి దొరికిపోతే ఏం చేస్తారు ? మీ సీటు ఇతరులకు ఎప్పుడు కేటాయిస్తారు
వేరే కోచ్‌లో ఎక్కి టీటీఈకి దొరికిపోతే ఏం చేస్తారు ? మీ సీటు ఇతరులకు ఎప్పుడు కేటాయిస్తారు
NEET UG 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే
NEET UG 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. అప్లికేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇవే
Vishnu Manchu : విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసు - హీరో విష్ణు మంచుకు షాక్
Theatrical Releases This Week: లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు
లవర్స్ డే స్పెషల్... థియేటర్లలో ఈ వారం సందడి - రెండు రీ రిలీజులు, 10 కొత్త సినిమాలు
Tata Nexon లేదా Kia Sonet కార్లలో ఏది బెస్ట్.. ధర, మైలేజీ చూసి డిసైడ్ అవ్వండి
Tata Nexon లేదా Kia Sonet కార్లలో ఏది బెస్ట్.. ధర, మైలేజీ చూసి డిసైడ్ అవ్వండి
ENG vs NEP: ఉత్కంఠపోరులో నేపాల్‌పై ఇంగ్లాండ్ విజయం.. ఆకట్టుకుంటున్న చిన్న జట్లు
ఉత్కంఠపోరులో నేపాల్‌పై ఇంగ్లాండ్ విజయం.. ఆకట్టుకుంటున్న చిన్న జట్లు
Tirumala Laddu Adulteration: తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
తిరుమల లడ్డూ కల్తీ అని 4 నివేదికలు! అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ఛాలెంజ్!
Embed widget