Karmastalam Movie: పాన్ ఇండియా సినిమాలో 'బిగ్ బాస్' దివి... 'కర్మస్థలం' కొత్త పోస్టర్ చూశారా?
Bigg Boss Divi New Movie: 'బిగ్ బాస్'తో పాపులరైన తెలుగు అమ్మాయి దివి. కొన్ని సినిమాల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రధాన పాత్రలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది.

తెలుగు అమ్మాయి దివి వడ్త్యా (Divi Vadthya) తెలుసుగా. 'బిగ్ బాస్' ద్వారా ఆమెకు పాపులారిటీ వచ్చింది. ఆ రియాలిటీ షో కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు 'శ్రీమంతుడు'లో తళుక్కున మెరిశారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు. ఇంకొన్ని సినిమాల్లో కథానాయికగానూ నటించారు. ఇప్పుడు దివి వడ్త్యా ప్రధాన పాత్రలో పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది.
'కర్మస్థలం'లో దివి వారియర్ లుక్ చూశారా?
'బిగ్ బాస్' దివి వడ్త్యా ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'కర్మస్థలం' (Karmastalam Movie) చిత్రాన్ని సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ సంస్థలపై హర్ష వర్దన్ షిండే ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దివి యోధురాలి పాత్ర పోషిస్తున్నారు. ఆవిడ న్యూ లుక్ లేటెస్టుగా విడుదల చేశారు.
కదనరంగంలో దూసుకు వెళుతున్న యోధురాలిగా దివి లుక్, ఆమె చుట్టూ అగ్ని జ్వాలలు, వెనుక యుద్ధం చేస్తున్న సైనికులు... పోస్టర్ అయితే కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'కర్మస్థలం' విడుదల కానుంది. ఇందులో అర్చనా శాస్త్రి, బాలీవుడ్ నటుడు చుంకీ పాండే, టాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, 'కాలకేయ' ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, 'బలగం' సంజయ్, నాగ మహేష్, 'దిల్' రమేష్ ఇతర తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: శిరీష్ ప్రసాద్, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాణ సంస్థలు: సామ్రాద్ని ఫిల్మ్స్ - రాయ్ ఫిల్మ్స్, నిర్మాత: హర్ష వర్దన్ షిండే, దర్శకుడు: రాకీ షెర్మాన్.





















