Palash Muchhal Movie: డైరెక్టుగా ఓటీటీలోకి పలాష్ ముచ్చల్ డైరెక్ట్ చేసిన సినిమా... స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్టా??
Hum Tum Maktoob OTT Release Date: స్మృతి మంధానతో మ్యారేజ్ క్యాన్సిల్ తర్వాత పలాష్ ముచ్చల్ ఎక్కువ మందికి తెలిశారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు... డైరెక్టర్ కూడా! ఆయన మూవీ ఓటీటీలోకి వస్తోంది.

పలాష్ ముచ్చల్... ఇప్పుడీ పేరు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా ఉమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana)తో పెళ్లి క్యాన్సిల్ కావడం వల్ల పలాష్ పేరు ఎక్కువ వైరల్ అయ్యింది. ఆయన సంగీత దర్శకుడు, గాయకుడు అని చాలా మందికి తెలుసు. అయితే ఆయనలో దర్శకుడు కూడా ఉన్నారు. ఓ హిందీ సినిమా తీశారు. ఇప్పుడు ఆ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. అయితే... థియేటర్లలోకి రావడం లేదు. ఆ సినిమా ఓటీటీలోకి వస్తోంది.
డైరెక్టుగా ఓటీటీలోకి సినిమా...
పలాష్ 'హమ్ తుమ్ మక్తూబ్'!
Palash Muchhal's Hum Tum Maktoob OTT Platform Release Date: పలాష్ ముచ్చల్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా 'హమ్ తుమ్ మక్తూబ్'. ఈ గురువారం (డిసెంబర్ 11వ తేదీన) డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. అది కూడా రెగ్యులర్ ఓటీటీ వేదికల్లో కాదు... వేవ్స్ ఓటీటీలోకి!
'హమ్ తుమ్ మక్తూబ్' సినిమాలో రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో తొమ్మిది మంది స్పెషల్ కిడ్స్ నటించారు. మూవీ పోస్టర్ చూస్తే... ఇటీవల ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్'లో నటించిన చిన్నారులు కొందరు ఈ సినిమాలోనూ నటించినట్టు అర్థం అవుతోంది.
Also Read: Nivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్
అతిథి పాత్రల్లో టైగర్, కపిల్ శర్మ!
బాలీవుడ్ యంగ్ స్టార్, డూప్ లేకుండా రియల్ యాక్షన్ సీన్స్ చేయడంలో వెరీ వెరీ స్పెషలిస్ట్ అనిపించుకున్న టైగర్ ష్రాఫ్ తెలుసు కదా! ఆయన 'హమ్ తుమ్ మక్తూబ్'లో అతిథి పాత్ర చేశారు. అలాగే, బాలీవుడ్ పాపులర్ కమెడియన్ కపిల్ శర్మ మరొక అతిథి పాత్ర చేశారు.
RAJPAL YADAV - RUBINA DILAIK - PALAASH MUCHHAL REUNITE: 'HUM TUM MAKTOOB' FILMING BEGINS MID-AUG 2024... Writer-director #PalaashMuchhal announces his new film, titled #HumTumMaktoob, with an #AnnouncementPoster.
— taran adarsh (@taran_adarsh) July 25, 2024
Stars #RajpalYadav, #RubinaDilaik and nine special kids... Also… pic.twitter.com/aQXM7w5zEQ
స్మృతి మంధానతో పెళ్లి అయ్యుంటే?
స్మృతి మంధానతో పలాష్ ముచ్చల్ పెళ్లి గనుక జరిగి ఉంటే... ఇప్పుడు 'హమ్ తుమ్ మక్తూబ్'కు వేరే లెవల్ క్రేజ్ వచ్చేది. ప్రమోషన్ బాగా జరిగేది. మ్యారేజ్ క్యాన్సిల్ కావడం వల్ల సైలెంట్‌గా ఓటీటీలోకి సినిమాను తీసుకు వస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వెనుక మ్యారేజ్ క్యాన్సిల్ ఎఫెక్ట్ ఉండొచ్చని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.





















