Nari Nari Naduma Murari Release Date: బాలయ్య టైటిల్‌తో వస్తున్న శర్వా... రిలీజ్ డేట్ ఫిక్స్ - సంక్రాంతికి హ్యాట్రిక్ కొడతాడా?
Nari Nari Naduma Murari Release Date 2026: బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్ 'నారి నారి నడుమ మురారి'తో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఓ సినిమా చేశారు. సంక్రాంతి బరిలో ఆ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాల్లో 'నారి నారి నడుమ మురారి' ఒకటి. ఇప్పుడీ టైటిల్ (Nari Nari Naduma Murari Movie 2026)తో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ సినిమా చేశారు. నయా 'నారి నారి నడుమ మురారి' (2026 సినిమా)ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. ఇప్పుడు డేట్ అనౌన్స్ చేశారు.
జనవరి 14న శర్వానంద్ సినిమా!
Sharwanand's Nari Nari Naduma Murari Release Date Announced: సంక్రాంతి బరిలో అందరి కంటే ముందు రెబల్ స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' రానుంది. అదే రోజున దళపతి విజయ్ 'జన నాయకుడు', తర్వాత జనవరి 14న నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు', తమిళ్ నుంచి శివకార్తికేయన్ 'పరాశక్తి' విడుదల కానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్' ఉంది. సంక్రాంతి బరిలో అందరి తర్వాత శర్వానంద్ రానున్నారు. జనవరి 14వ తేదీ సాయంత్రం 5.49 గంటల నుంచి సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. జనవరి 15న ఉదయం అన్ని థియేటర్లలో సినిమా విడుదల అవుతుంది.
సంక్రాంతి బరిలో శర్వానంద్ ట్రాక్ రికార్డ్ బావుంది. 'శతమానం భవతి', 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాలు పెద్ద పండక్కి విడుదలై భారీ విజయాలు సాధించాయి. మరి, ఈ 'నారి నారి నడుమ మురారి'తో 2026లో విజయం సాధించి... సంక్రాంతికి శర్వా హ్యాట్రిక్ కొడతాడో? లేదో? వెయిట్ అండ్ సి.
Also Read: Japan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ
View this post on Instagram
హిట్ సినిమా దర్శకుడితో శర్వా సినిమా!
'సామజవరగమన' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో 'నారి నారి నడుమ మురారి' సినిమా చేశారు శర్వానంద్. సకుటుంబ సమేతంగా చూసేలా సినిమాను తెరకెక్కించారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై.లి. సహకారంతో ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు. శర్వానంద్ సరసన సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించిన 'నారి నారి నడుమ మురారి'కి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం సమకూర్చగా... జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందించారు. భాను భోగవరపు కథ రాయగా, నందు సావిరిగన సంభాషణలు రాశారు.
Also Read: Nivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్





















