Actress Poorna : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ - భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్
Actress Poorna Baby : హీరోయిన్ పూర్ణ రెండోసారి తల్లయ్యారు. శనివారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Actress Poorna Emotional Moment With New Baby Girl : ప్రముఖ నటి పూర్ణ రెండోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇది మాకు లభించిన అపురూపమైన కానుక అంటూ భర్త షానిద్ అసిఫ్‌తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.
థాంక్యూ గాడ్
ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా డెలివరీ జరిగిందని... అందుకు ఆస్పత్రి సిబ్బందికి, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొంటున్నట్లు తెలిపారు. 'అల్లాహ్ నా జీవితాన్ని మరో విలువైన గిఫ్ట్‌తో ఆశీర్వదించాడు. శనివారం తెల్లవారుజామున 4:25 గంటలకు, ఫజ్ర్ సమయానికి దగ్గరగా మాకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమె పుట్టిన వెంటనే, ఆమె చెవులలో అధాన్ ఇఖామత్ వినిపించాయి. మా గారాల పట్టికి మేము 'దువా జమీలా' అని పేరు పెట్టాం. ఆమె మా మొత్తం ఫ్యామిలీకి గొప్ప దీవెన.' అంటూ రాసుకొచ్చారు.
2022లో పూర్ణ ప్రముఖ బిజినెస్ మ్యాన్ షానిద్ అసిఫ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆ తర్వాత ఏడాది ఓ బాబు జన్మించాడు. ఆ చిన్నారి హమ్దాన్ ఆసిఫ్ అలీ అని పేరు పెట్టారు. ఇప్పుడు మరో పాపకు జన్మనిచ్చారు. ఈ జంటకు పలువురు ప్రముఖులు, నెటిజన్లు విషెష్ చెబుతున్నారు.
View this post on Instagram
Also Read : మ్యాజిక్ జరిగింది... ట్రైలర్ అదిరింది - ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగాస్టార్ రివ్యూ
స్వతహాగా మలయాళ నటి అయిన పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిం. జయమ్ము నిశ్చయమ్మురా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అవును, అవును 2, సీమ టపాకాయ్, అఖండ, 3 రోజెస్, దసరా, అసలు, అఖండ 2 మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో 'కుర్చీని మడతపెట్టి...' సాంగ్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. లాస్ట్‌గా బాలయ్య అఖండ 2 మూవీలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటించారు.
ట్రెండింగ్ వార్తలు























