Japan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ
Prabhas Condition - Japan Earthquake: 'బాహుబలి: ది ఎపిక్' జపాన్ ప్రీమియర్స్ కోసం నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ప్రభాస్ జపాన్ వెళ్లారు. అక్కడ భూకంపం వచ్చింది. అయితే ఫ్యాన్స్ కంగారు పడకండి.

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, మన బాహుబలి ప్రభాస్ (Prabhas) అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు. 'బాహుబలి: ది బిగినింగ్' విడుదల అయ్యి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇండియాలో ఆ మూవీ విడుదలైంది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు జపాన్ (Baahubali The Epic 2025 Japan Release)లో విడుదలైంది. 'బాహుబలి: ది ఎపిక్' జపాన్ ప్రీమియర్స్ కోసం నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి జపాన్ వెళ్లారు ప్రభాస్. కట్ చేస్తే...
జపాన్‌లో భూకంపం... ప్రభాస్ పరిస్థితి ఏంటి?
'బాహుబలి: ది ఎపిక్' ప్రీమియర్స్ కోసం ప్రభాస్ జపాన్ వెళితే... ఆ దేశంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 7.5 నమోదు అయ్యింది. దాంతో ప్రభాస్ కండిషన్ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందడం మొదలు పెట్టారు. ప్రభాస్ ఎక్కడ ఉన్నారో? ఆయనకు ఏమైందో? ఎలా ఉందోనని రెబల్ స్టార్ అభిమానులు కాస్త ఆందోళన పడిన మాట వాస్తవం. వాళ్ళకు ఊరట కలిగించే మాట చెప్పారు దర్శకుడు మారుతి.
Also Read: Nivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్
ప్రభాస్ టోక్యోలో లేరు... సురక్షితంగా ఉన్నారు!
ప్రభాస్ టోక్యోలో లేరని, ప్రస్తుతం ఆయన సురక్షితంగా ఉన్నారని, ఆయనతో ఫోన్ మాట్లాడినట్టు 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి ట్వీట్ చేశారు. సో... రెబల్ ఫ్యాన్స్ ఎటువంటి ఆందోళన చెందవద్దు.
Also Read: డిసెంబర్ 12 విడుదలకు ఇవాళే డెడ్ లైన్... 'అఖండ 2' నిర్మాతల ముందున్న సవాళ్లు!
Spoke to Darling he is not in Tokyo and doing safe no worries 👍
— Director Maruthi (@DirectorMaruthi) December 9, 2025
Prabhas Upcoming Movies: ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే... జనవరి 9న 'ది రాజా సాబ్' రిలీజ్ కానుంది. ఇటీవల ఆయన 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ సినిమా కాకుండా 'ఫౌజీ' కూడా చేస్తున్నారు. దానితో పాటు సీక్వెల్స్ 'కల్కి 2898 ఏడీ 2', 'సలార్ 2' కూడా ఉన్నాయి.





















