Akhanda 2: డిసెంబర్ 12 విడుదలకు ఇవాళే డెడ్ లైన్... 'అఖండ 2' నిర్మాతల ముందున్న సవాళ్లు!
Akhanda 2 Latest Release Date: 'అఖండ 2' విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ శుక్రవారం సినిమా విడుదల కావాలంటే ఈ రోజు అన్ని క్లియరెన్సులు రావాలి. సో 'అఖండ 2' నిర్మాతలకు ఇవాళ కీలకం కానుంది.

Akhanda 2 Release Latest Update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'అఖండ 2' విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. లోకల్ సమస్యలు అయితే ఇండస్ట్రీ పెద్దలు సెటిల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ, ఇక్కడ సమస్య బాలీవుడ్ కంపెనీతో! అది కూడా కోర్టులో ఉంది. అందువల్ల, సమస్య పరిష్కారానికి సమయం పట్టింది. అయితే కోర్టు నుంచి క్లియరెన్సులు రావాల్సి ఉంది. విడుదలకు ఈ రోజు లైన్ క్లియర్ అవుతుందని తెలిసింది. క్లియర్ అవ్వాలి కూడా! ఎందుకు అంటే... ఈ శుక్రవారం - డిసెంబర్ 12న సినిమా విడుదలకు ఈ రోజే డెడ్ లైన్ అని చెప్పాలి.
డిసెంబర్ 12న సినిమా వస్తుందా?
శుక్రవారమే 'అఖండ 2' విడుదల!?
'అఖండ 2' రిలీజ్ క్యాన్సిల్ అయ్యి, విడుదల వాయిదా పడుతుందని ఎవరూ ఊహించలేదు. అదొక హఠాత్ పరిణామం. సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలనీ థియేటర్లు బ్లాక్ చేసిన డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాక్ తగిలింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అయితే తమకు జరిగిన నష్టానికి 11 కోట్లు వెనక్కి ఇవ్వమని అడిగారట (Akhanda 2 Overseas Loss: ఓవర్సీస్‌లో 'అఖండ 2'కు ఎదురుదెబ్బ... ఇప్పుడు 11 కోట్లు లాస్, పైగా తక్కువ రేటు!).
'అఖండ 2' లోకల్ డిస్ట్రిబ్యూటర్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది ఉన్నారు. అగ్ర నిర్మాతలు డి సురేష్ బాబు, 'దిల్' రాజు సైతం సమస్యను పరిష్కరించాడనికి రంగంలోకి దిగారు. ఆ తర్వాత 'అఖండ 2' తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ జరిగింది. అందులో మెజారిటీ శాతం డిసెంబర్ 12న సినిమా రిలీజ్ చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.
Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?
డిసెంబర్ 19న 'అవతార్: ఫైర్ అండ్ యాష్' విడుదల అవుతుంది. అమెరికాలో ఆ సినిమాకు తప్ప మరొక సినిమాకు స్క్రీన్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇండియాలో కూడా 'అవతార్' ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆ సినిమాకు పిల్లలతో కలిసి వెళ్లాలని ప్లాన్ చేసే ఫ్యామిలీలు ఉంటాయి. అందువల్ల డిసెంబర్ 12న రిలీజ్ చేయడం బెస్ట్ అని డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయం. ఆ రోజు విడుదల చేయాలి అంటే... ఇవాళ అన్ని సమస్యలు క్లియర్ అవ్వాలి.
'అఖండ 2' నిర్మాతల ముందున్న సవాళ్లు!
డిసెంబర్ 12న 'అఖండ 2' విడుదల చేయాలంటే... ఇవాళ (డిసెంబర్ 9న) చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట చాలా కష్టపడాలి. సమయానికి ఎదురీది చాలా పనులు చేయించాలి. అందులో మొదటిది... చెన్నై హైకోర్టులో ఎరోస్ కేసు నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడం. అవుటాఫ్ కోర్టు సెటిల్మెంట్ జరిగిందని 14 రీల్స్ ప్లస్ సన్నిహిత వర్గాల సమాచారం. అది కోర్టుకు తెలియజేసి సినిమా విడుదలపై స్టే ఎత్తి వేయించాలి. రెండోది... ఓవర్సీస్ రిలీజ్ విషయంలో ప్లానింగ్. అమెరికాలో భారీ ఎత్తున 'అఖండ 2' విడుదల చేయడానికి ప్లాన్ చేస్తే ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది. అక్కడ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయారు. ఆయనతో సెటిల్ చేసుకోవాల్సిన లెక్కలు ఉన్నాయి. మూడోది, ముఖ్యమైనది... తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల చేత జీవోలు తెప్పించుకోవడం. టికెట్ రేట్ హైక్, ప్రీమియర్ షోలకు రెండు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. అయితే ఇప్పుడు విడుదల తేదీ మారింది కనుక మళ్ళీ కొత్త జీవోలు తెప్పించుకోవాలి. అదీ సంగతి!
Also Read: Balakrishna Taluka: బాలకృష్ణ తాలూకా ఎవరు? 'అఖండ 2'కు అండగా నిలబడేది ఎవరు?





















