అన్వేషించండి

Toxic First Single : టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...

Tabaahi Song : రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'తబాహీ' సాంగ్ వచ్చేసింది. అయితే, అందరూ ఊహించినట్లుగా లిరికల్ వీడియో కాకుండా కేవలం సౌండ్ ట్రాక్ మాత్రమే రిలీజ్ చేశారు.

Yash's Toxic First Single Tabaahi Telugu Lyrical Video Out : రాకింగ్  స్టార్ యశ్ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్' నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. యశ్, కియారా అడ్వాణీ రొమాంటిక్ ట్రాక్‌ 'తబాహీ' పాటను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. అయితే, లిరికల్ వీడియో రిలీజ్ చేస్తారని భావించిన ఫ్యాన్స్‌కు కాస్త నిరాశే ఎదురైంది. కేవలం సౌండ్ ట్రాక్ మాత్రమే విడుదల చేశారు.

యశ్, కియారాల స్టిల్స్, డ్యాన్స్, విజువల్స్ ఏమీ లేకుండానే పాట రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి తెలుగు లిరిక్స్ అందించగా... విశాల్ మిశ్రా పాడారు. మూవీలో 'రాయ'గా యశ్, నదియా పాత్రలో కియారా కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్ ఓసారి చూస్తే...

తబాహీ సాంగ్ లిరిక్స్

పల్లవి

లోకం సంకెళ్లు తెంచేద్దాం... కాలం పరదాలు కాల్చేద్దాం

మనకై మనమై జీవించుదాం...

తబాహీ... తబాహీ... తబాహీ.... తబాహీ... తబాహీ

తబాహీ... తబాహీ... తబాహీ.... తబాహీ... తబాహీ...

చరణం 1

ఆంక్షలే ధ్వంసమే వీడని చెలిమిలో...

కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో...

అంతం అవుదాం మనలో మనం... తబాహీ.....

తబాహీ... తబాహీ... తబాహీ.... తబాహీ... తబాహీ

తబాహీ... తబాహీ... తబాహీ.... తబాహీ... తబాహీ...

చరణం 2

ఉరిమే రుధిరం... ఉరికే అధరం...

సరాగాన్ని సమీపించినే శిశిరం...

నీ నాస్వరం రణ భాస్వరం... తబాహీ...

తబాహీ... తబాహీ... తబాహీ.... తబాహీ... తబాహీ

తబాహీ... తబాహీ... తబాహీ.... తబాహీ... తబాహీ...

Also Read : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం

ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. KGFను మించి యాక్షన్ సీక్వెన్స్, వయలెన్స్ వీడియోలో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా... హీరో ఇంట్రడక్షన్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. టీజర్ ఫ్యాన్స్ ఎక్స్‌‍పెక్టేషన్స్ రీచ్ కాగా... ఫస్ట్ సాంగ్‌‌తో మాత్రం కాస్త నిరాశ చెందారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Music South (@zmcsouth)

మూవీలో యశ్, కియారా అడ్వాణీలతో పాటు ఎలిజిబెత్‌గా హ్యూమా ఖురేషీ, గంగ పాత్రలో నయనతార, రెబెకా తార సుతారియా, మెలిసా పాత్రలో రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. సముద్ర తీరం చుట్టూ మాఫియా, ఇల్లీగల్ బిజినెస్, నేర సామ్రాజ్యం, సిండికేట్స్ మధ్య ఓ సామాన్యుడు లీడర్‌గా ఎలా ఎదిగాడనేదే ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. 1940 - 70 మధ్య గోవా బ్యాక్ డ్రాప్‌లో జరిగే పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.

ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
Telugu TV Movies Today: ఈ శనివారం (మార్చి 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
ఈ శనివారం (మార్చి 14) తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో తెలుసా? లిస్ట్ చూసేయండి!
Aaya Sher Song: ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
ఆయా షేర్ కోసం రెండున్నర ఎకరాల్లో సెట్స్... సాంగ్ సెట్ స్టోరీ తెలుసా?
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Embed widget