Akhanda 2 Overseas Loss: ఓవర్సీస్‌లో 'అఖండ 2'కు ఎదురుదెబ్బ... ఇప్పుడు 11 కోట్లు లాస్, పైగా తక్కువ రేటు!
Akhanda 2 Latest News Updates: ఒక్కసారి సినిమా విడుదల వాయిదా పడితే రేట్లు తగ్గుతాయి. డిస్ట్రిబ్యూటర్లు బేరాలు మొదలు పెడతారు. ఇప్పుడు 'అఖండ 2'కు అదే జరుగుతోందని ట్రేడ్ వర్గాల టాక్.

ఒక్కసారి సినిమా విడుదల వాయిదా పడిందా? అంతే సంగతులు! అందులోనూ ఆ సినిమాకు ఫైనాన్షియల్ ఇష్యూలు ఉన్నాయా? నిర్మాతల దగ్గర డబ్బులు తక్కువ పడ్డాయా? మరో మాట చెప్పాల్సిన అవసరం లేదు! అప్పటి వరకు వచ్చిన రేట్లు మళ్ళీ రావు. డిస్ట్రిబ్యూటర్లు బేరసారాలు మొదలు పెడతారు. ఇప్పుడు 'అఖండ 2' విషయంలోనూ అదే జరుగుతోందని టాలీవుడ్ ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్.
ఓవర్సీస్ నుంచి మొదటి ఎదురుదెబ్బ!
సాధారణంగా సినిమా విడుదల వాయిదా పడితే అంతకు ముందు ఆఫర్ చేసిన రేటు కంటే కొంచెం తక్కువకు అడగటం సహజం. 'అఖండ 2 తాండవం' కేసు వేరు. సరిగ్గా ప్రీమియర్ షోలు మొదలు కావడానికి కొన్ని గంటల ముందు రిలీజ్ క్యాన్సిల్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో సంగతి పక్కన పెడితే... అగ్రిమెంట్లు వంటివి పక్కాగా చేసుకునే ఓవర్సీస్ (అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లో) మార్కెట్టులో సినిమాకు మొదటి దెబ్బ పడింది.
Also Read: Balakrishna Taluka: బాలకృష్ణ తాలూకా ఎవరు? 'అఖండ 2'కు అండగా నిలబడేది ఎవరు?
తెలుగు సినిమాకు అమెరికా, కెనడా మార్కెట్ ఎంత కీలకం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ 'అఖండ 2' ప్రీమియర్ షోస్ షెడ్యూల్ చేశారు. స్క్రీన్స్ (మల్టీప్లెక్స్ థియేటర్స్)కు డబ్బులు కట్టి షోస్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సడన్ రిలీజ్ క్యాన్సిల్ వల్ల 11 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని, ఆ అమౌంట్ తనకు ఇవ్వమని యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ అడుగుతున్నారట. అంతే కాకుండా ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వలేమని, తాము అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చిన అమౌంట్ రీఫండ్ చేయమని, వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవరికైనా సినిమాను ఇవ్వమని స్పష్టం చేశారట.
Also Read: 'అఖండ 2' వాయిదాకు కారణాలు... మద్రాస్ హైకోర్టులో, ల్యాబ్ దగ్గర ఏం జరిగింది?
తెలుగు రాష్ట్రాల్లోనూ బేరసారాలు మొదలు!
అమెరికాలో మాత్రమే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో థియేటర్లు 'అఖండ 2' విడుదల కోసం రెడీ అయ్యాయి. ఒక్కసారిగా సినిమా వాయిదా పడటం వల్ల అంతకు ముందు సినిమాలు వేయాల్సి వచ్చింది. దాని వల్ల ఎంత లాస్ వచ్చిందనేది పక్కన పెడితే... వాయిదా వల్ల సినిమాకు ఉన్న క్రేజ్ తగ్గిందని, అందువల్ల ముందుగా వేసిన లెక్కల ప్రకారం ప్రేక్షకులు రావడం కష్టం అని డిస్ట్రిబ్యూషన్ రేట్లు తగ్గించమని చెప్పారట. విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ వస్తే లెక్కలు తేలుతాయి.
Also Read: Akhanda 2 Vs Veeramallu: అఖండ 2 vs వీరమల్లు... బాలయ్య vs పవన్... ఎందుకీ రచ్చ? ఏమిటీ డిస్కషన్??





















