Suyodhana Teaser Review : హీరో ఒక్కడికే వినిపిస్తే... అతనికే కనిపిస్తే... ఎవరీ సుయోధన?
Suyodhana Teaser Reaction : టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సుయోధన'. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Priyadarshi's Suyodhana Teaser Review : మహా భారతంలో దుర్యోధనుడికి మరో పేరే సుయోధనుడు. అదే పేరుతో లేటెస్ట్‌గా సుయోధన మూవీ సైతం రూపొందింది. టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా నటించిన ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
సుయోధన టీజర్ ఎలా ఉందంటే?
ఓ యువకుడికి ఓ అపరిచత వ్యక్తి నుంచి సుయోధన అనే పిలుపు. దుర్యోధనుడిలా కనిపించే ఆకారం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేదే ప్రధానాంశంగా మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. 'అసలు నీకు ఈ స్టోరీ ఎక్కడ దొరికింది?' అంటూ హీరోయిన్‌ను హీరో ప్రశ్నించగా... ఇది రియల్ స్టోరీ అంటూ ఆమె చెప్పడం సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
తనకు కలలో సుయోధనుడిలా కనిపించే వ్యక్తి గురించి అసలు నిజాన్ని తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు. ఈ క్రమంలో అతనికి ఎదురైన ఇబ్బందుల ఆధారంగా మూవీని రూపొందించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. అసలు సుయోధనునికి హీరోకు సంబంధం ఏంటి? ఎవరైనా కావాలని అలా చేస్తున్నారా? సుయోధనుడి స్టోరీ హీరో లైఫ్‌లోకి వచ్చినప్పటి నుంచీ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ - భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్
రిలీజ్ ఎప్పుడంటే?
ఈ మూవీకి వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించగా... ప్రియదర్శి సరసన ద్రిషిక చందర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. జై క్రిష్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు




















