అన్వేషించండి

12A Railway Colony OTT : సడన్‌గా ఓటీటీలోకి హారర్ క్రైమ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

12A Railway Colony OTT Platform : అల్లరి నరేష్ రీసెంట్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ' సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Allari Naresh's 12A Railway Colony OTT Streaming : అల్లరి నరేష్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ'. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి మా 'ఊరి పొలిమేర', 'పొలిమేర 2' మూవీస్ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అందించగా... నాని కాసరగడ్డ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

నరేష్, కామాక్షి భాస్కర్లతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, మధుమణి, గగన్ విహారి, అనీష్ కురువిల్లా తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి మూవీని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

Also Read : అఖండ 2 రిలీజ్ టీజర్... త్రిశూలం పట్టిన శివునిలా బాలయ్య - దిష్టి తీసే షాట్ సూపరంతే

స్టోరీ ఏంటంటే?

వరంగల్‌లోని రైల్వే కాలనీలో కార్తీక్ (అల్లరి నరేష్) తన ఫ్రెండ్స్‌తో కలిసి జీవిస్తుంటాడు. అనాథగా పెరిగిన కార్తిక్‌కు అతని ఫ్రెండ్సే జీవితం. లోకల్ పొలిటీషియన్ టిల్లు (జీవన్ కుమార్)కు నమ్మిన బంటు. గత 2 ఎన్నికల్లో ఓడిన టిల్లు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలని ప్రయత్నిస్తుంటాడు. దీని కోసం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కార్తిక్‌కు అప్పగిస్తాడు. ఇందులో భాగంగా యూత్‌ను అట్రాక్ట్ చేసేందుకు కార్తిక్ తన కాలనీలో యువతీ యువకులకు ఆటల పోటీ నిర్వహిస్తుంటాడు.

తన పక్కింట్లో ఉండే ఆరాధన (కామాక్షి భాస్కర్ల)ను తొలిచూపులోనే చూసి కార్తీక్ ఇష్టపడతాడు. పైకి అతన్ని అసహ్యించుకుంటున్నా లోపల మాత్రం కార్తిక్‌ను ఇష్టపడుతుంది ఆరాధన. ఓ రోజు ఓ ఇంపార్టెంట్ పార్శిల్ కార్తిక్‌కు ఇచ్చి దాచిపెట్టమంటాడు టిల్లు. అది ఓపెన్ చెయ్యొద్దని హెచ్చరిస్తాడు. అయితే, పోలీసులు తన ఇంటిపై రైడ్‌కు వస్తున్నారని తెలుసుకున్న కార్తిక్ ఆ పార్శిల్‌ను పక్కింట్లో ఉండే ఆరాధన ఇంట్లో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. దొంగతనంగా వారి ఇంట్లోకి వెళ్లి చూడగా ఆరాధన చూసి తనను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాలని అంటుంది. అయితే, పై గదిలో ఏదో చప్పుడు కావడంతో వెళ్లిన కార్తిక్... ఆరాధన, ఆమె తల్లి చనిపోయి ఉండడం చూసి షాక్ అవుతాడు. అసలు ఆరాధన ఫ్యామిలీని చంపింది ఎవరు? టిల్లు తాను ఎమ్మెల్యే అయ్యేందుకు ఏం ప్లాన్ చేశాడు? తనపై పడ్డ హత్యా నేరం నుంచి కార్తిక్ ఎలా బయటపడ్డాడు? ఆరాధన తన భార్య అంటూ బయటకు వచ్చిన ప్రముఖ డాక్టర్ జయదేవ్ కురువిల్లాకు ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? దీని వెనుక మిస్టరీ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
Advertisement

వీడియోలు

Allu Arjun 42 New Rules Viral Video | బన్నీతో మాట్లాడాలంటే 42 రూల్స్ ఉన్నాయా.? వైరల్ వీడియోలో నిజమెంత.? | ABP Desam
Attack on PM Modi at Parliament | ప్రధాని మోదీపై మహిళా ఎంపీల ప్రీ ప్లాన్డ్ ఎటాక్.? | ABP Desam
India vs Pakistan T20 World Cup | ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
BCCI Central Contract | కోహ్లీ, రోహిత్‌ గ్రేడ్ తగ్గింపు
ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన -పబ్లిసిటీ ఎక్కువ..పని తక్కువని విమర్శలు
TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!
Andhra Pradesh News: ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు రాజకీయ చిచ్చు పెట్టిన కేంద్రం! పార్లమెంట్‌ సాక్షిగా సంచలన విషయాలు వెల్లడి!
AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు
AP Assembly Sessions: అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
అమరావతిలో అసెంబ్లీ నగారా- బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు.. వైసీపీ వన్ డే ప్లాన్!
Hydra Latest News: కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
కబ్జా చెర నుంచి పార్క్, ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా! 1500 కోట్ల విలువైన ల్యాండ్‌ సేఫ్‌!
Sumanth: సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
Telangana Municipal Elections: మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్
మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఎన్నిక రద్దు- మంత్రి వాకిటి శ్రీహరిని బర్తరఫ్ చేయాలని డిమాండ్
Embed widget