Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Udit Narayan : ఉదిత్ నారాయణ్ ముద్దు వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఈ వివాదంపై స్పందించిన సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Udit Narayan Kissing Video : ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదం(Singer Udit Narayan Kissing Fans Video)పై స్పందించారు. గతంలో ఉదిత్ ఓ కాన్సెర్ట్‌లో పాల్గొన్నారు. అక్కడ 'టిప్ టిప్ బర్సా పానీ' పాడుతున్న సమయంలో కొందరు అభిమానులు స్టేజ్ వద్దకు వెళ్లారు. ఉదిత్ సాంగ్ పాడుతూ ఫ్యాన్స్‌కు ఫోటోలు ఇస్తూ.. మహిళా అభిమానులకు ఒకరి తర్వాత ఒకరిని ముద్దు పెట్టుకున్నారు ఉదిత్ నారాయణ్. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి.. వివాదానికి దారి తీసింది.
వైరల్ వీడియోలో ఏమున్నదంటే..
అభిమానులు ఉదిత్ నారాయణ్ (Udit Narayan) పాడుతున్న స్టేజ్ వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ క్రమంలో ఆయన మహిళ అభిమానులకు ఫోటోలతో పాటు.. బుగ్గలపై ముద్దులు ఇచ్చారు. మరో మహిళా అభిమాని కూడా ఆయనకు ముద్దు ఇచ్చే క్రమంలో.. ఆమె పెదాలపై ముద్దు పెట్టుకున్నట్లు వీడియోలో కనిపించింది. ఈ క్రమంలో కాన్సర్ట్కి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఉదిత్‌పై వివాదం మొదలైంది.
Udit narayan, tham jao sir. 😭😭 pic.twitter.com/AtIYhYt6ZX
— Prayag (@theprayagtiwari) January 31, 2025
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు దీనిని సమర్థిస్తుండగా.. మరికొందరు ఆయన చర్యను తప్పుబడుతున్నారు. ఇది సరైన చర్య కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదిత్ నారాయణ్ ఈ వివాదంపై స్పందించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ రిప్లై ఇచ్చారు.
అది కేవలం ప్రేమ మాత్రమే..
నాకు, నా కుటుంబానికి లేదా దేశానికి అవమానం కలిగించేలా నేను బిహేవ్ చేయలేదు. జీవితంలో ఎన్నో సాధించాను. అలాంటప్పుడు ఈ సమయంలో తప్పు ఎందుకు చేస్తాను? నా కచేరీలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తరలివస్తారు. కాన్సెర్ట్స్కి నెలల ముందే టికెట్లన్నీ అమ్ముడవుతాయి. నా అభిమానులకు నాకు అలాంటి స్వచ్ఛమైన, స్ట్రాంగ్ బంధం ఉంది. మీరు వైరల్ అవుతున్న వీడియోలో చూసింది నాకు, నా అభిమానులకు మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనమే. వారు నన్ను ప్రేమిస్తున్నారు. నేను కూడా వారిని అంతే ప్రేమిస్తున్నాను. అంటూ రిప్లై ఇచ్చారు.
Also Read : వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
నేను తప్పు చేయలేదు.. సిగ్గుపడను
ఈ విషయంలో నేను ఎందుకు సిగ్గు పడాలి. నేను చేసింది అసభ్యకరమైన, సీక్రెట్ పని కాదు. అది పబ్లిక్ డొమైన్‌లోనే ఉంది. కొందరు వ్యక్తులు కావాలనే నాపై బురద చల్లాలని చూస్తున్నారు. అలాంటివారిని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఇతరుల సక్సెస్‌ని చూసి తట్టుకోలేని వ్యక్తుల గురించి నేను పట్టించుకోనంటూ తెలిపారు. అందుకే ఎప్పుడో జరిగిన కాన్సెర్ట్ వీడియోని ఇప్పుడు తెరపైకి తెచ్చి వివాదం చేస్తున్నారంటూ షాకింగ్ విషయాన్ని తెలిపారు ఉదిత్.
Also Read : 'గేమ్ చేంజర్' తీగ లాగితే... 'దేవర', 'పుష్ప 2' గుట్టు బయటకు వచ్చిందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

