Chiranjeevi: వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా... అనిల్ రావిపూడి, ఓదెలకు మధ్యలోనా? తర్వాత?
Chiranjeevi New Movie: మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అది అనిల్ రావిపూడి సినిమా తర్వాత ఉంటుందా? లేదంటే శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తి చేశాక చేస్తారా? అనేది ప్రశ్న.

Chiranjeevi next movie after Viswambhara: సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'తో వేసవిలో థియేటర్లలో సందడి చేయడానికి మెగాస్టార్ చిరంజీవి సిద్ధం అవుతున్నారు. అంత కంటే ముందు 'సంక్రాంతికి వస్తున్నాం'తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్తారని ఒక టాక్. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మెగాస్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వీరాభిమానితో మెగాస్టార్ మరో సినిమా!
ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవికి వీరాభిమానులు చాలా మంది ఉన్నారు. ఈ తరం దర్శకులలో బాబి కొల్లి (కేఎస్ రవీంద్ర) కూడా మెగాస్టార్ డై హార్ట్ ఫ్యాన్. 'వాల్తేరు వీరయ్య'తో తన అభిమాన కథానాయకుడికి భారీ విజయం అందించారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కార్ ఉందని సమాచారం.
'వాల్తేరు వీరయ్య' తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'డాకు మహారాజ్' సినిమా తీశారు బాబి. సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా మంచి విజయం సాధించింది. వాట్ నెక్స్ట్? 'డాకు మహారాజ్' తర్వాత బాబి చేయబోయే సినిమా ఏమిటి? అంటే... చిరంజీవి పేరు వినబడుతోంది.
చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడుగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారని ఫిలిం నగర్ టాక్. ఈమధ్య చిరుని కలిసి బాబి ఒక లైన్ వినిపించారని దానిని డెవలప్ చేయమని చిరు చెప్పారని వినబడుతోంది.
అనిల్ రావిపూడి, ఓదెల సినిమాకు మధ్యలోనా?
'విశ్వంభర' చిత్రీకరణను చిరంజీవి దాదాపు పూర్తి చేశారు. దాని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడం గ్యారంటీ అని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ, అనిల్ రావిపూడి దాదాపుగా చేయడం కన్ఫర్మ్ అన్నట్టు చెబుతున్నారు. అందులో మరొక సందేహం అవసరం లేదు. అయితే, అనిల్ రావిపూడి సినిమా తరువాత ఎవరి దర్శకత్వంలో చిరు సినిమా చేస్తారనేది ప్రశ్న.
సినిమా చేయడానికి అనిల్ రావిపూడి పెద్దగా సమయం తీసుకోరు. కథ కోసం రెండు మూడు నెలలు, ఆ తర్వాత చిత్రీకరణ పూర్తి చేయడానికి నాలుగైదు నెలలు అంతే. అనిల్ రావిపూడి కాకుండా తన వీరాభిమాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా అంగీకరించారు చిరంజీవి. 'దసరా' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, ప్రస్తుతం నాని హీరోగా మరో సినిమా 'ప్యారడైజ్' చేస్తున్నారు. అది పూర్తి కావడానికి సమయం పడుతుంది. ఆ లోగా బాబీ సినిమా పూర్తి చేస్తారా?లేదంటే శ్రీకాంత్ ఓదెలా సినిమా చేసిన తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తారా? అనేది చూడాలి.
Also Read: అల్లు అర్జున్ వస్తున్నాడు... కండిషన్స్ అప్లై... చైతూ టీమ్ అలా చేయక తప్పదు మరి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

