Ratha Saptami 2025: రథ సప్తమి రాష్ట్రపండుగే.. భక్తజనానికి సమాచారం చేరేదెలా!
Arasavalli Sun Temple:ఏటా రథసప్తమివేడుకలకు డిసెంబర్ నుంచే దేవాదాయ,ధర్మాదాయశాఖ అధికారులు ఆ పనిలో నిమగ్నమైఉంటారు. ఈ ఏడాది రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారులు రంగంలోకి దిగారు.. మరి పనులు జరుగుతున్నాయా?

Sri Suryanarayana Swamy Temple Arasavalli : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి గ్రామం సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా వేడుకగా నిర్వహించే రథసప్తమిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ప్రభుత్వం ఇచ్చే నిధులు, స్థానిక సంస్థల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. అయితే ఈ పనులు దసరా అయినప్పటి నుంచి ప్రారంభించి ఉంటే చాలా వరకు పూర్తయ్యేవి. అలా కాకుండా సంక్రాంతి అయ్యాక మొదలుపెట్టారు.
రథసప్తమి ఈ ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారమంటూ రోడ్లు విస్తరణ, డివైడర్ల నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు, వేల మందిజనంతో సూర్యనమస్కారాలు, పెద్ద స్థాయిలో భక్తసంగీత విభావరిలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది పాలనా యంత్రాంగం. అయితే ఇన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు సమయం సరిపోతుందా? సరిపడా అధికారులు ఉన్నారా? శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోఇంజనీరింగ్ అధికారులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని పోస్టులుఖాళీగా ఉన్నాయి, టౌన్ ప్లానింగ్ అధికారులు,
సిబ్బంది ఎంతమంది, అందులో ఎన్ని ఉద్యోగాలుఖాళీగా ఉన్నాయి, రెవెన్యూ అధికారులు ఎంతమంది ఉన్నారు? సరిపడా సిబ్బంది లేకుండా సధ్యమయ్యే పనేనా? అమాత్యుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నాం అంటున్నారు కొందరు మున్సిపల్ సిబ్బంది.
Also Read: ప్రత్యక్ష దైవం సూర్య నారాయణుని రథసప్తమి వేడుకలు - ఆ గ్రామస్థులకు ప్రత్యేక దర్శనం
గతంలోఓ పెద్ద కార్పొరేషన్ కు కమిషనర్ గా పనిచేసినఅనుభవం ఉన్న కలెక్టర్ ఆ తర్వాత జిల్లాలో వివిధ శాఖలకు అధికారిగా విధులు నిర్వహించిన దాఖలాలు లేవు. నేరుగా జిల్లాకలెక్టర్గా బాధ్యతలు నిర్వహించడంతో ఒకవైపు జిల్లాలో వివిధ శాఖల పని విధానం పరిశీలన,ప్రభుత్వానికి నివేదించడం లాంటి పనుల్లోనిమగ్నమవుతూనే మరోవైపు రథసప్తమి వేడుకలుపనులు కూడా పర్యవేక్షించాల్సి వస్తోంది. ఈక్రమంలోనే అన్ని పనులు నిర్వహించేందుకుప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి చేరుకొనేందుకు ప్రస్తుతానికి ఉన్న సమయం సరిపోతుందా అన్నది సందేహమే..
ఏటాఒక్కరోజు మాత్రమే రథసప్తమి వేడుకలుజరుగుతాయి. ఈ ఏడాది వరుసగా మూడు రోజులునిర్వహించాలన్నది పాలకుల నిర్ణయం. దీనినిఅమలు చేయాలంటే అధికారులపై ఒత్తిడి మరింతఎక్కువవుతోంది. ఇప్పటికే పనిభారంతో ఉన్నఅధికారులు, ఉద్యోగులు మూడు రోజులనిర్వహణకు, వేగవంతంగా పనులు నిర్వహణకుతీసుకోవాల్సిన చర్యలపై మరింత ఆందోళన చెందుతున్నారు. శాసనమండలి ఎన్నికల కోడ్ విడుదల కావడంతో అంతకంటే ముందే రథసప్తమి వేడుకల పోస్టర్ ఆవిష్కరణకు నోచుకుంది. అయితే ఇది కేవలం విద్యావంతులకు మాత్రమే వేడుకల షెడ్యూల్ తెలిసే అవకాశం ఉంటుంది. ఆంధ్రాలో పల్లె జనానికి రెండు రోజుల్లో సమాచారం చేరడం సాధ్యమా అంటే ముమ్మాటికి అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుగనున్నట్టు జిల్లా ప్రజలకు, ఇతర జిల్లాల్లో ఉండే ముఖ్యులకు మాత్రమే తెలుసు. ఆదరాబాదరాగా నిర్వహిస్తున్న పనులు పక్కనపెట్టి ముందుగా రథసప్తమి వేడుకల ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ, క్యూలైన్ల నిర్వహణ, వాహనాల రాకపోకల పార్కింగ్, భక్తులకు సౌకర్యాలు లాంటి వాటిపై శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులు రథసప్తమి తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడే అద్భుతంగా కనిపించాలని అనుకుంటే భక్తుల సౌకర్యాల విషయంలో కష్టనష్టాలు ఎదుర్కొనే ప్రమాదముంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో ప్రోటోకాల్ కష్టాలు అధికారులకు లేకపోవడం ఓ ఆనందం కలిగించే విషయమైనా రథసప్తమి వేడుకలపై ప్రచారం, నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని భక్తజనం కోరుకుంటున్నారు
Also Read: రథ సప్తమి, వసంత పంచమి, మహా శివరాత్రి సహా ఫిబ్రవరిలో ( మాఘ మాసంలో) వచ్చే పండుగలివే!
ప్రత్యక్ష భగవంతునిగా, ఆరోగ్య ప్రదాతగా వెలుగొందుతూ నిత్య పూజలు అందుకునే శ్రీ సూర్యనారాయణ స్వామి ఏకైక దేవాలయం శ్రీకాకుళంలోని అరసవల్లి పుణ్యక్షేత్రం. సూర్య జయంతిని పురస్కరించుకుని యేటా రథసప్తమి వేడుకలు ఇక్కడ కన్నుల పండుగగా నిర్వహించడం, ప్రపంచంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారి నిజరూప దర్శనానికి తరలిరావడం తెలిసిందే. కోట్లు ఖర్చు పెట్టినా స్థాయికి తగ్గ ప్రచారం లేకపోతే ఏ కార్యక్రమం విజయవంతం అయిన దాఖలాలు లేవంటున్నారు స్థానిక భక్తులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

