అన్వేషించండి

Ugadi 2026: ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం! అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?

Parabhava Nama Samvatsaram (2026-2027) : ఈ ఉగాది నుంచి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరం పేరే పరాభవ... అంటే ఇక పరాభవాలేనా , ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారు?

 Parabhava Nama Samvatsaram Ugadi 2026:  2026 మార్చి 19 న ఉగాది. ఈ రోజు నుంచి శ్రీ పరాభవ నామ సంవత్సరం మొదలవుతోంది. తెలుగు క్యాలెండర్లో 60 సంవత్సరాల ( ప్రభవ నుంచి అక్షయ వరకు) చక్రంలో పరాభవ నామ సంవత్సరం 40వది. 

పరాభవ అంటే సంస్కృతంలో ఓటమి, పతనం, అవమానం లేదా పరాజయం అని అర్థం. కొన్ని జ్యోతిష్యశాస్త్ర గ్రంధాల్లో ఈ సంవత్సరం ప్రజలు ఒకరినొకరు అవమానించుకోలడం, ఓటములు ఎదుర్కోవడం, ధననష్టం, నైతిక పతనాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అందుకే ఈ పేరు వినగానే అంటే అన్నీ పరాభావాలేనా అని ఆందోళన చెందుతున్నారు కొందరు..అసలు ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారన్నది మరికొందరి సందేహం. 

జ్యోతిష్య శాస్త్రంలో 60 సంవత్సరాల చక్రం ( బృహస్పతి గ్రహం ఒక్కో రాశిని దాటడం ఆధారంగా) ప్రకృతి, మనిషి స్వభావం, సమాజంలో వచ్చే మార్పులు సూచించేందుకు ఈ పేర్లు ఇచ్చారు. 

ఈ పేర్లు కేవలం ప్రతికూల ప్రభావం చూపిస్తాయని కాదు..ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులు ( తీపి, చేదు, పులుపు, కారం, తీపి, ఉప్పు) లా జీవితంలోనూ ప్రతికూలత, అనుకూలత రెండూ ఉంటాయని అర్థం. అంటే జీవితంలో సుఖాలే కాదు దుఃఖాలు , సవాళ్లు కూడా ఉంటాయని గుర్తుచేసేందుకే ఈ పేర్లు వచ్చాయ్. 

60 ఏళ్ల సంవత్సర చక్రం బాల్యం నుంచి వృద్యాప్యం వరకూ మనిషి జీవితి చక్రాన్ని పోలిఉంటుందని చెబుతారు పండితులు. 60 ఏళ్లు నిండిన తర్వాత మనిషి మళ్లీ కొత్తగా జన్మించినట్టే. అందుకే వృద్ధులను - చిన్నపిల్లలను ఒకేలా భావించాలంటారు

పురాణాల ప్రకారం నారదుడి సంతానం పేర్లు ఈ 60 సంవత్సరాలు

ముఖ్య ఉద్దేశం మాత్రం సమాజానికి ముందస్తు హెచ్చరిక ఇవ్వడం

జ్యోతిష్య శాస్త్రంలో కూడా పరాభవ నామ సంవత్సరాన్ని పరిణామం, మార్పు , కొత్త ప్రారంభాలకు సూచనగా చూస్తారు

అహంకారం ఉన్నవారికి ఓటమి తప్పదు..వినయంగా ఉంటే మీ జీవితంలో మీరే ఊహించనంత అద్భుతమైన మార్పులు వస్తాయి
 
కేవలం సంవత్సరం పేరు వల్లే ఫలితాలు ఆధారపడి ఉండవు..ఇది ఓ సూచన మాత్రమే. కర్మ, ప్రయత్నం, భక్తి, ధర్మం ఆధారంగా ఫలితాలు మారుతాయి.  ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచులు జీవితంలో ఉంటాయనే సూచన. 

ఈ ఏడాది మార్చి 19 గురువారం ఉగాది..కొత్త సంవత్సరాది. ఈ తెలుగు సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి, మీ కలలు నెరేవాలని ABP దేశం ఆకాంక్షిస్తోంది...

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు

వృషభ రాశివారికి పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందా? 2026 ఉగాది పంచాంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mercury Retrograde 2026: మీనంలో తిరోగమనంలో బుధుడు.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం! మీ రాశి ఉందా?
మీనంలో తిరోగమనంలో బుధుడు.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం! మీ రాశి ఉందా?
Womens Day 2026 Wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!
2026 మార్చి 07 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 07 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Red Heifer: ఇజ్రాయెల్ లో ఎర్ర ఆవు జననం ప్రపంచ అంతానికి సూచనా? ఇది భయమా - వాస్తవమా?
ఇజ్రాయెల్ లో ఎర్ర ఆవు జననం ప్రపంచ అంతానికి సూచనా? ఇది భయమా - వాస్తవమా?
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
Pawan Kalyan: పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
పరిపాలనలో పవన్ కళ్యాణ్ మార్క్.. తన శాఖల్లో పనులపై బుక్‌లెట్ - కుప్పానికి ఎంత కేటాయించారంటే..
IND vs NZ Final: భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే టీ20 ప్రపంచ కప్ విజేత ఎవరు?
Womens Day 2026 Wishes: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! మీ జీవితంలోని మహిళలకు ఈ శక్తివంతమైన శ్లోకాలతో శుభాకాంక్షలు చెప్పేయండి!
క్రెటా, సెల్టోస్‌కు పోటీగా త్వరలో మార్కెట్లోకి Nissan Tekton.. ఫీచర్లు తెలుసుకుని కొనేయండి
క్రెటా, సెల్టోస్‌కు పోటీగా త్వరలో మార్కెట్లోకి Nissan Tekton.. ఫీచర్లు తెలుసుకుని కొనేయండి
Mercury Retrograde 2026: మీనంలో తిరోగమనంలో బుధుడు.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం! మీ రాశి ఉందా?
మీనంలో తిరోగమనంలో బుధుడు.. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం! మీ రాశి ఉందా?
Russia Oil : రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికాతో పని లేదు - ఫిబ్రవరిలోనూ భారీగా దిగుమతి - తప్పుడు ప్రచారంపై ఇవిగో నిజాలు
రష్యా ఆయిల్ కొనుగోలుకు అమెరికాతో పని లేదు - ఫిబ్రవరిలోనూ భారీగా దిగుమతి - తప్పుడు ప్రచారంపై ఇవిగో నిజాలు
IND vs NZ Final: మోదీ స్టేడియంలో భారత్‌కు చేదు అనుభవాలు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఫ్యాన్స్ టెన్షన్
మోదీ స్టేడియంలో భారత్‌కు చేదు అనుభవాలు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు ఫ్యాన్స్ టెన్షన్
Embed widget