important Days in February 2025: రథ సప్తమి, వసంత పంచమి, మహా శివరాత్రి సహా ఫిబ్రవరిలో ( మాఘ మాసంలో) వచ్చే పండుగలివే!
February 2025 Hindu Festival Calendar: వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు, చదువుల తల్లి ఆరాధనకు, ఆదిత్యుడి పూజకు అనువైన మాసం మాఘం. ఈ నెలంతా చేసే దేవాతారాధనకు, నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది..

Hindu Festivals List In February 2025 : 2025 జనవరి 30 గురువారం ఫిబ్రవరి 28 శుక్రవారం వరకూ మాఘమాసం.. ఈ నెల రోజులు ఎన్నో పండుగలు..అన్నీ విశిష్టమైనవే..
ఫిబ్రవరి 03 వసంత పంచమి
వసంతపంచమినే కొన్ని ప్రాంతాల్లో శ్రీ పంచమి, మదన పంచమి అంటారు. ఈ రోజు సరస్వతీదేవి ఆరాధన విశేష ఫలితాన్నిస్తుంది. ఈ రోజు చిన్నారులకు బాసర సహా సరస్వతీ ఆలయాల్లో అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఇదే రోజు కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ ఏడాది మహా కుంభమేళా జరుగుతున్నందున..నాలుగో రాజస్నానం చేసేది ఈరోజే. వసంత పంచమి తర్వాత వచ్చే షష్టిని విశోక షష్టి , మందార షష్టి , రామ షష్టి , వరుణ షష్టి అని కూడా అంటారు. ఈ రోజు ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూప దీపాలతో వరుణుడిని పూజించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.
Also Read: మాఘ మాసం మొదలు .. వివాహాది శుభాకార్యాలకు ముహూర్తాలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు!
ఫిబ్రవరి 04 రథ సప్తమి
మాఘమాసంలో ఆరంభంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రోజు సూర్య జయంతి జరుపుకుంటారు. సూర్యకిరణాలు పడే ప్రదేశంలో పాలు పొంగించి ఆదిత్యుడికి పూజచేస్తారు.
ఫిబ్రవరి 05 భీష్మాష్టమి
రథసప్తమి తర్వాత రోజు వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజు కురువృద్ధుడైన భీష్మపితామహుడికి తర్పణాలు విడుస్తారు.
ఫిబ్రవరి 6 మధ్వనవమి
మాఘ శుద్ధ నవమిని మధ్వనవమి అంటారు. ఈ రోజు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం జరుగుతుంది.
ఫిబ్రవరి 7 దశమి
ఈ రోజు తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం నిర్వహిస్తారు. కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి పుష్పయాగం కన్నులపండువగా నిర్వహిస్తారు
Also Read: కుంభం నుంచి మీనం లోకి శుక్రుడు.. ఈ 5 రాశులవారికి ప్రయోజనం..మిగిలిన వారు అప్రమత్తం!
ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి
మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి జరుపుకుంటారు. కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉండి..ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజు మరణించాడు. ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్ణ ఏకాదశి అంటారు. ఇదే రోజు అంతర్వేది తీర్థం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ
కార్తీక పూర్ణిమకు ఎంత విశిష్టత ఉందో మాఘ పూర్ణిమకు అంతే విశిష్టత ఉంది. ఈ రోజున సముద్రస్నానం, నదీస్నానం, త్రివేణి సంగమంలో స్నానం చయేడం విశేష ఫలప్రదం. ఈ రోజు చేసే దానధర్మాలు రెట్టింపు ఫలితాలన్నిస్తాయి
ఫిబ్రవరి 13 కుంభ సంక్రాంతి
నెలకో రాశిలోకి పరివర్తనం చెందే సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభంలోకి ప్రవేశిస్తాడు. ఇదే కుంభ సంక్రాంతి..
ఫిబ్రవరి 26 మహా శివరాత్రి
హిందువుల ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశి రోజు శివరాత్రి జరుపుకుంటారు. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి రోజు మాస శివరాత్రి చేసుకున్నా..మహా శివరాత్రి అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!






















