Pawan kalyan vs Peddireddy Ramachandra reddy | సీమలో పెద్దిరెడ్డిని పవన్ ఢీ కొడతారా.? | ABP Desam
మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డికి నేరుగా విసురుతున్న సవాల్. ఇసుకలో 40వేల కోట్లు దోచేశానని చెప్పావ్. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తే వాటిని నేపాల్ లో పట్టుకున్నారని చెప్పావ్..మరిప్పుడు నువ్వే డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నించారు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి.
పవన్ కళ్యాణే ప్రశ్నిస్తూ అధికారంలోకి వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తే దాని పర్యవసానం మరోలా ఉంటుంది అనేది జనసేన నాయకుల ఫీలింగ్. ఇంతకీ పవన్ ను ఇలా పెద్దిరెడ్డి డైరెక్ట్ గా టార్గెట్ చేయటానికి కారణం ఏంటో ఓ సారి మాట్లాడుకుందాం.
చిత్తూరు జిల్లా పులిచర్ల తాలుకూ మంగళం పేటలో పెద్దరెడ్డి అటవీ భూమిని ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని...చుట్టూ దట్టమైన అడవి ఉన్నా తను అటవీశాఖ మంత్రిగా ఉన్న టైమ్ లో పెద్దిరెడ్డి నిబంధనలను అతిక్రమించి ఇలా అడవిలో విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నారని ఓ ప్రముఖపత్రిక ఆర్టికల్ రాసింది. అతడు అడవిని ఆక్రమించాడనే హెడ్డింగ్స్ తో. అది బాగా జనాల్లోకి వెళ్లింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ ఈ ఆక్రమణల అరోపణల మీద దర్యాప్తు చేయాలని ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అటవీసంరక్షణ ముఖ్య అధికారిని ఆదేశించారు.
దానికి రియాక్ట్ అయిన పెద్ది రెడ్డి...నిన్న ఈవెనింగ్ ప్రెస్ మీట్ పెట్టి అసలు అది అటవీ భూమే కాదని ప్రైవేట్ ల్యాండ్ అని..దీనిపై కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని కొన్ని కాపీలు చూపించారు. ఇక్కడా వరకూ బాగానే ఉన్నా ఈ ఆరోపణలు కారణమైన వారిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని...పవన్ తనపై గతంలోనూ చేసిన ఆరోపణల మీద ఏం మాట్లాడతారని ప్రశ్నించారు.
ఇలానే ప్రశ్నిస్తూ కాకినాడ పోర్టును బేస్ చేసుకుని కొన్నేళ్లుగా నడుస్తున్న బియ్యం మాఫియా ను సీజ్ ది షిప్ డైలాగుతో పవన్ గడగడలాండించాడని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ , పెద్దిరెడ్డిని ఢీకొట్టే టైమ్ వచ్చిందని...ఇన్నాళ్లూ జనసేన అంటే గోదావరి జిల్లాలే అన్నట్లుండేదని ఇప్పుడు తమ బలాన్ని రాయలసీమకు కూడా తీసుకువెళ్లాలంటే పెద్దిరెడ్డి ఎపిసోడ్ ను పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకోవాలని జన సైనికులు రిక్వెస్టులు పెడుతున్నారు.





















