NPS Vatsalya: బడ్జెట్‌లో నిర్మలమ్మ వరాల జల్లు - ఎన్‌పీఎస్ వాత్సల్య పథకానికి రూ.50 వేల పన్ను మినహాయింపు
NPS Account: ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం 2024 సెప్టెంబర్ 18న అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల కోసం NPS ఖాతా(Vatsalya Account) లను ప్రారంభించవచ్చు.

Union Budget 2025 : 2025 బడ్జెట్‌లో పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను సవరించకపోయినా, NPS వాత్సల్య పథకానికి రూ.50,000 పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ప్రకటించారు. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొంటూ, "నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)కి లభించే పన్ను ప్రయోజనాలను NPS వాత్సల్య (NPS Vatsalya) ఖాతాల్లోని విరాళాలపై కూడా వర్తింపజేయాలని ప్రతిపాదిస్తున్నాం" అని సీతారామన్ పేర్కొన్నారు.
NPS వాత్సల్య పథకం:
NPS వాత్సల్య పథకం 2024 సెప్టెంబర్ 18న అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల కోసం NPS ఖాతా(Vatsalya Account) లను ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ప్రతి సంవత్సరం కనీసం రూ. 1,000 వరకు జమ చేయవచ్చు.. కానీ ఈ పథకానికి ఎలాంటి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. పిల్లలు 18 సంవత్సరాల వయస్సుకు చేరిన తరువాత, ఈ ఖాతా వారి పేరుకు మార్చబడుతుంది. దానిపై జమ చేసిన మొత్తం NPS-Tier 1 ఖాతా లేదా ఇతర సంబంధిత ఖాతాలకు మార్చుకోవచ్చు.
పన్ను మినహాయింపు:
ఈ పథకంలో, తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ పిల్లల NPS వాత్సల్య ఖాతాలో చేసిన జమలపై రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు పొందగలరు. ఈ మినహాయింపు సెక్షన్ 80CCD(1B) కింద అందించబడుతుంది. ఈ పథకం పిల్లల కోసం దీర్ఘకాలికంగా ఒక పెట్టుబడి నిధిని సృష్టించడానికి ఉపకరిస్తుంది. చిన్న మొత్తాలు కూడా సాపేక్షంగా సమయంతో పెరిగి పెద్ద మొత్తంగా మారవచ్చు. తద్వారా పిల్లలు పెద్ద వయస్సులో తమ స్వంత ఆదాయాన్ని పొందడం ప్రారంభిస్తారు.
సమగ్ర ప్రయోజనాలు:
ఈ పథకం పిల్లలు, తల్లిదండ్రులకు ఆర్థిక ప్రయోజనాలను భారీగా పెంచేలా డిజైన్ చేశారు. అలాగే దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది.
రూ. 1000 తో ఖాతా ఓపెన్ చేయవచ్చు
మీ పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి ఇప్పుడు NPS వాత్సల్య పథకంలో పెన్షన్ ఖాతాను తెరవవచ్చు. దీని నిర్వహణ PFRDA చేతుల్లోనే ఉంటుంది. దీనితో పాటు, ఆర్థిక మంత్రి ఎన్‌పీఎస్ వాత్సల్య కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రారంభించారు. దీని సబ్‌స్క్రిప్షన్‌పై, మీకు పర్మనెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్ కార్డ్ (PRAN కార్డ్) కూడా మంజూరు చేస్తారు. ఈ పథకంలో వార్షికంగా 1000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఈ పథకం మీకు 75 శాతం మొత్తాన్ని ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఇస్తుంది. ఇందులో డిఫాల్ట్ ఎంపిక 50 శాతం మాత్రమే ఉంటుంది. దీన్ని అన్ని బ్యాంకులు, ఇండియా పోస్ట్, పెన్షన్ ఫండ్ల ద్వారా తెరవవచ్చు. దీని కోసం పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రులు KYC పూర్తి చేయాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

