Washington Plane Helicoptor Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం | ABP Desam
టెక్నాలజీ పరంగా అత్యంత అప్డేటెడ్ గా ఉండే అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ఉన్న నేషనల్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై దిగేందుకు సిద్ధంగా ఉన్న విమానాన్ని ఓ హెలికాఫ్టర్ వచ్చి అమాంతం ఢీకొట్టింది. ఫలితంగా రెండూ రెండు ముక్కలై కిందనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి 63 మంది ఉండగా...హెలికాఫ్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నారు. రక్షణశాఖకు చెందిన సికోర్ స్క్రీ హెచ్ 60 అనే బ్లాక్ హాక్ హెలికాఫ్టర్ ను ట్రైనింగ్ కోసం వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు కూడా హెలికాఫ్టర్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటివరకూ విపత్తుదళాలు పోటోమాక్ నుంచి 18మంది మృతదేహాలను బయటుకు తీసుకువచ్చాయి. హైపోథెర్మియా కారణంగా గడ్డకట్టి ఉన్న నదిలో ఎక్కువ సేపు బతకలేరని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. వీలైనంత త్వరగా నదిలో విపత్తు రక్షణ దళాలు తమ ఆపరేషన్ ను కంప్లీట్ చేయాలన్న ట్రంప్..టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉన్నా కూడా ఇలాంటి ఓ ఘటన జరగటం అస్సలు ఊహించలేమన్నారు.





















