Union Budget 2025 : బడ్జెట్ 2025-26 స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.. రైల్వే బడ్జెట్‌ని కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు కలిపారో, బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి మహిళ ఎవరో తెలుసా?
Budget 2025 Facts : ఇండియా మొత్తం ఇప్పుడు బడ్జెట్ బజ్ ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటివరకు బడ్జెట్ గురించి ఎక్కువ మందికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడున్నాయి. చూసేయండి.

Special and Interesting Facts About the Union Budget 2025 : ఇండియా ఎదురు చూస్తోన్న బడ్జెట్ 2025-26 వచ్చేసింది. ప్రతి భారత పౌరుడి భవిష్యత్తుకు ఈ బడ్జెట్ కీలకం కానుంది. అందుకే బడ్జెట్ గురించిన బజ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఈ సమయంలో బడ్జెట్ గురించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. మొదటిసారి బడ్జెట్‌ని ఎప్పుడు ప్రవేశ పెట్టారు. ఎవరు ఎక్కువసార్లు బడ్జెట్ సమర్పించారు. అతి ఎక్కువ మాట్లాడింది ఎవరు? తక్కువ ఎవరు మాట్లాడారు వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడున్నాయి. చూసేయండి.
ఇండియాలో మొదటి బడ్జెట్
ఇండియాలో మొదటి బడ్జెట్ స్వాతంత్య్రం రాకముందు.. ఏప్రిల్ 7, 1860లో ప్రవేశ పెట్టారు. స్వాతంత్ర్యం రాకముందు.. బ్రిటీష్ పాలనలో.. జేమ్స్ విల్సన్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఈ బడ్జెట్‌ని సమర్పించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొదటి బడ్జెట్‌ను నవంబర్ 26, 1947వ సంవత్సరంలో మొదటిసారిగా ఆర్థిక మంత్రి ఆర్ కె షణ్ముకమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
ఎవరు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంటే..
మాజీ ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయ్.. ఇండియాలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. ఆర్థికశాఖ మంత్రిగా 1962 నుంచి 1969 వరకు మొత్తం పదిసార్లు బడ్జెట్‌ను సమర్పించారు. తర్వాత ప్లేస్‌లో పి. చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ఆర్థిక మంత్రులుగా బడ్జెట్ సమర్పించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 తన 8వ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దీని ప్రకారం.. ఆమె ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా తర్వాత స్థానంలో ఉన్నారు.
అతిపెద్ద స్పీచ్
నిర్మలా సీతారామన్ 2020-21 బడ్జెట్ సమావేశంలో భాగంగా ఫిబ్రవరి 1, 2020వ తేదీన 2 గంటల 42 నిమిషాలు బడ్జెట్‌ని ప్రజెంట్ చేశారు. ఇదే అన్ని బడ్జెట్ సమావేశాల్లో అతి పెద్ద స్పీచ్. అయితే ఇది ఆమె పూర్తి స్పీచ్ కూడా కాదు. ఇంకో రెండు పేజీలు మిగిలి ఉండగా.. ఆమెకు కాస్త ఇబ్బందిగా ఉండి.. స్పీకర్‌తో ఆ స్పీచ్‌ని ముగించారు. అయినా కూడా ఇదే అతి పెద్ద బడ్జెట్ స్పీచ్. జూలై 2019లో 2 గంటల 17 నిమిషాలు మాట్లాడిన.. ఆమె రికార్డును.. 2020లో ఆమెనే బ్రేక్ చేసుకున్నారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన మొదటి మహిళ
బడ్జెట్‌ని ప్రవేశ పెట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్. మరి మొదటి మహిళ ఎవరంటే.. ఇందిరా గాంధీ. 1970-71 ఆర్థిక సంవత్సరంలో ఇందిరా గాంధీ బడ్జెట్‌ని సమర్పించిన మొదటి మహిళగా నిలిచారు.
ఎక్కువ పదాలు ఉపయోగించిందెవరంటే..
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఎక్కువ మట్లాడలేదు అనుకుంటారు కానీ.. బడ్జెట్ స్పీచ్‌లలో ఎక్కువ పదాలు ఉపయోగించి బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన రికార్డ్ క్రియేట్ చేశారు. 1991లో నరసింహ రావు హయాంలో 18,650 పదాలు ఉపయోగించి.. స్పీచ్ ఇచ్చారు మన్మోహన్ సింగ్.
అరుణ్ జైట్లీ.. 2018లో ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. 18,604 పదాలు ఉపయోగించి.. సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. దాదాపు 1 గంట 49 నిమిషాలు ఆయన బడ్జెట్ గురించి ప్రసంగించారు. 1977లో హిరుభాయి పటేల్ 800 పదాలతో అతి చిన్న స్పీచ్ ఇచ్చారు.
రైల్వే బడ్జెట్
2017 వరకు రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌ను విడిగానే ప్రవేశపెట్టేవారు. 92 ఏళ్ల తర్వాత.. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్లో మెర్జ్ చేసి.. 2017లో రెండిటీని కలిపి ప్రవేశపెట్టారు.
పేపర్లేని బడ్జెట్
బ్రీఫ్‌కేస్ బడ్జెట్‌కి, పేపర్లేని బడ్జెట్‌కి చెక్ పెట్టింది నిర్మలా సీతారామనే. 2023లో పేపర్లేని బడ్జెట్‌ని ప్రవేశ పెట్టారు. టెక్నాలజీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్‌ను పేపర్లలో కాకుండా.. ట్యాబ్లెట్‌తో ప్రవేశ పెట్టారు నిర్మల.
Also Read : బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

