Nirmala Sitharaman: ‘పద్మశ్రీ’ గ్రహీత కానుకిచ్చిన చీరలో నిర్మలమ్మ .. ప్రతి'శారీ' ప్రత్యేకమే!
Budget 2025 Saree:ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారమన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు ఆమె కట్టే చీర చాలా ప్రత్యేకం. అప్పటి నుంచి ఇప్పటివరకూ.. మరి ఈ ఏడాది చీర ప్రత్యేకత ఏంటో తెలుసా

Nirmala Sitharaman Budget Day Saree: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు వెళ్లిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ట్యాబ్ ను మీడియాకు చూపించారు. ఏటా బడ్జెట్ లానే ఈ ఏడాది కూడా నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరపై స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా..
నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీర మధుబని ఆర్ట్ కి ఓ ట్రిబ్యూట్ అని ప్రకటించారు. బిహార్ కు చెందిన దులారీ దేవి మధుబని ఆర్ట్ ను విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చేశారు..అందుకోసం ఆమెకు 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్ని అందించింది. గతంలో మధుబని ఆర్ట్ గురించి తెలుసుకునేందుకు నిర్మలా సీతారామన్ మిథిలా ఆర్ట్ ఇని స్టిట్యూట్ కి వెళ్లినప్పుడు అక్కడ దులారీ దేవిని కలిశారు. ఆ సందర్భంగా దులారీ దేవి బహుమతిగా ఇచ్చిన మధుబని ఆర్ట్ శారీని ఆమె కృషికి ట్రిబ్యూట్ గా బడ్జెట్ రోజు కట్టుకున్నారు నిర్మలాసీతారామన్.
Also Read: బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలా సీతారామన్- అడ్డుతగిలిన ప్రతిపక్షం
కేంద్ర బడ్జెట్ సమర్పించేటప్పుడు నిర్మలా ధరించే చీరకు చాలా ప్రత్యేకత ఉంటుంది. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రదర్శించేలా చీర ధరిస్తారామె. అందుకే ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేవేళ కూడా నిర్మలా సీతారమన్ కట్టుకునే చీర గురించి చర్చ జరిగింది.
2024 ఫిబ్రవరిలో బడ్జెట్ సమర్పించిన సమయంలో నిర్మలా నీలిరంగు చీర కట్టుకున్నారు. ఇది పశ్చిమబెంగాల్లో లభించే కంఠా ఎంబ్రాయిడరీ డిజైన్ స్పెషల్. అక్కడ ప్రాచీన ఎంబ్రాయిడరీ వర్కులలో ఒకటైన కంఠా డిజైన్ ఉన్న శారీ తెప్పించుకున్నారు. ఆక్వా కల్చ్ ఉత్పాదకతకు, మన దేశంలో మత్స్య రంగం అభివృద్ధికి సూచనగా వర్ణించారు
2023లో బడ్జెట్‌ను సమర్పించేందుకు ఎర్రటి చీర కట్టుకున్నారు నిర్మలా సీతారామన్. టెంపుల్ బార్డర్ ఉన్న ఈ చీర కర్ణాటక ధార్వాడ్ ప్రాంతానికి చెందినది. దీనిపై రథాలు, నెమళ్లు, కమలం డిజైన్లు అందంగా కనిపించాయి.
2022లో బడ్జెట్‌ను సమర్పించే సమయంలో ఒడిశాలోని గంజాం జిల్లాలో నేసే ప్రత్యేకమైన బొమకాయ్ చీరను ధరించారు.
2021లో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలంగాణ పోచంపల్లి నుంచి ప్రత్యేకమైన చీర తెప్పించుకుని కట్టుకున్నారు.
2020లో బడ్జెట్‌ను సమర్పించేటప్పుడు పసుపు రంగు చీర కట్టుకున్నారు. భారతీయులకు ముఖ్యంగా హిందువులకు పసుపు శుభాన్నిచ్చే రంగు. శ్రేయస్సుని కలిగించే రంగు..అందుకు చిహ్నంగా ఈ పసుపు రంగు ధరించారు.
2019లో బడ్జెట్ సమర్పించే సమయంలో సీతారామన్ మంగళగిరి నుంచి తెప్పించుకున్న బంగారు రంగు అంచుగల గులాబీ రంగు చీర కట్టుకున్నారు.
Also Read: నిర్మలా సీతారామన్‌కు స్వీటు తినిపించిన రాష్ట్రపతి ముర్ము, సామాన్యుడి నోరు తీపి చేస్తారా?
ఏటా బడ్జెట్ సమర్పించేటప్పుడు ఒక్కో రాష్ట్రం నుంచి అక్కడ ప్రత్యేకమైన చీరలు తెప్పించుకుని ధరిస్తుంటారు నిర్మలమ్మ. మనదేశంలో చేనేత గొప్పదనాన్ని ఈ సందర్భంగా ప్రత్యేక చర్చకు తీసుకురావడం ఆమె ఉద్దేశం. అందుకు తగ్గట్టే బడ్జెట్ సమర్పించే రోజు ఆమె కట్టుకునే చీరలపై ప్రత్యేక చర్చ జరుగుతుంటుంది..ఆమె తీరు ప్రశంసలు అందుకుంటుంది.
Also Read: బడ్జెట్లో ఈ మార్పులు అన్ని రంగాల పెట్టుబడులను ఎలా ప్రభావితం చేస్తాయి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

