ICC Champions Trophy: ఫైనల్ చేరేవి ఆ రెండు జట్లే.. జోస్యం చెప్పిన పాంటింగ్, రవి శాస్త్రి
భారత్, ఆసీస్ జట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయని, మ్యాచ్ విన్నర్లకు కొదువలేదని పాంటింగ్ పేర్కొన్నాడు. గత 2 ఐసీసీ ఫైనల్స్ లో భారత్, ఆసీస్ జట్లు పాల్గొన్నాయి.అయితే 2 సార్లు ఆసీసే విజయం సాధించింది.

Ind Vs Aus: ఈనెల 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీపై ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్, రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ను గెలుపొందిన రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజా ఎడిషన్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు పైనల్ కు చేరుకుంటాయని వ్యాఖ్యానించాడు. ఐసీసీ రివ్యూ అనే కార్యక్రమంలో భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తో కలిసి తను పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పాంటింగ్ మాట్లాడుతూ.. ఇరుజట్లలోనూ ప్రతిభ గల ఆటగాళ్లకు కొదువ లేదని, మరోసారి ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఇరుజట్లు పోటీపడుతాయని పేర్కొన్నాడు. పాంటింగ్ మాటలకు శాస్త్రి కూడా అంగీకరించాడు.
ఇరుజట్లు చాలా పటిష్టంగా కనిపిస్తున్నాయని, మ్యాచ్ విన్నర్లకు కొదువలేదని పేర్కొన్నాడు. ఇటీవల రెండు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ లో భారత్, ఆసీస్ జట్లు పాల్గొన్నాయి. అయితే రెండుసార్లు ఆసీసే విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, 2023 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ ను ఓడించి ఆసీస్ విజేతగా నిలిచింది. అయితే 2024 టీ20 ప్రపంచకప్ సూపర్ సిక్స్ లో ఆసీస్ పై గెలిచి, ఆ జట్టు నాకౌట్ అవకాశాలను దెబ్బ తీసిన భారత్ ప్రతీకారం తీర్చుకుంది.
సెమీస్లోకి ప్రవేశించే జట్లివే..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత్, ఆసీస్ లతోపాటు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ లు ప్రవేశిస్తాయని పేర్కొన్నాయి. అయితే గ్రూప్ -ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఆడుతుండగా, గ్రూప్ -బిలో ఇంగ్లాండ్, ఆసీస్, సౌతాఫ్రికా, ఆఫ్గానిస్థాన్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్లోకి అర్హత సాధిస్తాయి. ఏ గ్రూపు నుంచి భారత్, న్యూజిలాండ్, గ్రూప్ బి నుంచి ఆసీస్, ఇంగ్లాండ్ సెమీస్ కు చేరేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి..
ఇక ఈ టోర్నీలో ఆతిథ్య పాక్.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. 2017లో భారత్ ను ఓడించిన పాక్ విజేతగా నిలిచింది. హైబ్రిడ్ మోడల్లో జరిగే ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా జరుగుతాయి. ఈనెల 20న బంగ్లాదేశ్ తో, 23న పాక్ తో, వచ్చేనెల 2న న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది. 2017లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని భారత్ గట్టి పట్టుదలగా ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇండియా. ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. 2017 తర్వాత పాక్ చేతిలో వన్డేల్లో భారత్ ఓడిపోలేదు. ఈ రికార్డును కూడా అలాగే కొనసాగించాలని భారత్ భావిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ కు ఈ టోర్నీ అగ్ని పరీక్షగా మారింది. ఇందులో విజయవంతమైతేనే వాళ్ల కెరీర్ ముందుకు సాగే అవకాశముంది. ఇక 2002, 2013లో చివరిసారిగా భారత్ ఈ టోర్నీ టైటిల్ నెగ్గింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

