Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Deep Depression in Bay of Bengal | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. నేడు దక్షిణ కోస్తాం, తమిళనాడు తీరం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దాని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయి.
District forecast of Andhra Pradesh dated 18-12-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/c6VLnlKjbt
— MC Amaravati (@AmaravatiMc) December 18, 2024
రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు కురిసే సమయంలో చెట్టు కిందకు వెళ్లడం, పాత బిల్డింగ్ ల కింద తల దాచుకోవడం లాంటివి చేయకూడదు. డిసెంబర్ 18న బుధవారం నాడు విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
తెలంగాణ ప్రజల్ని వణికిస్తున్న చలి
తెలంగాణలో గత వారం రోజులనుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే అయిదారు డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత అధికంగా ఉందని ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ పనివేళలు సైతం మార్చుతూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నెం | ఏరియా | గరిష్ట ఉష్ణోగ్రత | కనిష్ట ఉష్ణోగ్రత |
1 | ఆదిలాబాద్ | 28.5 | 6.7 |
2 | భద్రాచలం | 29 | 18 |
3 | హకీంపేట్ | 29.4 | 14.8 |
4 | దుండిగల్ | 30.4 | 14.7 |
5 | హన్మకొండ | 30.5 | 13 |
6 | హైదరాబాద్ | 29.6 | 14.7 |
7 | ఖమ్మం | 31.6 | 16.6 |
8 | మహబూబ్ నగర్ | 31.5 | 18.3 |
9 | మెదక్ | 29.8 | 7.8 |
10 | నల్గొండ | 26.4 | 18 |
11 | నిజామాబాద్ | 31.6 | 12.8 |
12 | రామగుండం | 29.2 | 12.1 |
చలి నుంచి జాగ్రత్తలు తీసుకోండి
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. ఆ సమయంలో వాహనాలు జాగ్రత్తక నడపకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో పగటి పూట ఎండ ప్రభావం చూపుతున్నా, రాత్రివేళ మాత్రం చలికి గజగజ వణికిపోతున్నారు. చెవులకు చల్ల గాలి పోకుండా చూసుకోవాలని, స్వెటర్, మఫ్లర్ లాంటివి వాడాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రిపూట వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని జలుబు, దబ్బు సమస్యలు రావని సూచించారు.
Also Read: Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !