SC Classification Bill: ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం - రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ
CM Revanth : ఎస్సీ క్లాసిఫికేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వర్గీకరణ వల్ల ఎవరికీ అన్యాయం జరగదని రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

SC Classification Bill Pass: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దామోదర రాజనర్సింహ ప్రవేశ పెట్టిన ఈ ఈ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గొప్ప విజయం లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రేవంత్ అసెంబ్లీలో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ దళితులకు అండగా ఉంటోందన్నారు. దశాబ్ధాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతోంది. ఎంతో మంది ప్రాణాలు అర్పించారన్నారు. బిల్లును ఎకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు కృతజ్ణతలు తెలిపారు.
1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని రేవంత్ గుర్తు చేశారు. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించిందన్నారు. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది .. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ను ఏర్పాటు చేశామన్నారు.
ఎస్సీ వర్గీకరణపై వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించామని..59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచామన్నారు. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రకటించారు. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారని .. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు.
It is indeed a matter of pride, @RahulGandhi Ji and @priyankagandhi Ji that our #Congress government in #Telangana is fulfilling every dream, implementing every guarantee & making real every promise.
— Revanth Reddy (@revanth_anumula) March 18, 2025
The revolutionary promise of 42 percent reservations for Backward Castes not… pic.twitter.com/5Q5r2CCJUp
రిజర్వెన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత అని రేవంత ్ప్రకటించారు. సభా నాయకుడిగా తాను మాట ఇస్తున్నానని… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదన్నారు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల ఇష్టం అని చెప్పడంతో ఈ బిల్లు ఆధారంగా ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. కేంద్రం ఆమోదం అవసరం లేదు.





















