అన్వేషించండి

YS Sharmila : వైఎస్ఆర్ పేరు తీసేయడంపై షర్మిల ఆగ్రహం - ఎన్టీఆర్ విజయవాడ అని పేరు పెట్టుకోవచ్చుగా అని విమర్శలు

YS Name: కడప, తాటిగడప ప్రాంతాలకు వైఎస్ఆర్ పేరు మార్పు అంశంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును విజయవాడకు పెట్టవచ్చుగా అని ప్రశ్నించారు.

Name Politics: వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాటిగడప మున్సిపాలిటీ పేరును కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వైఎస్ కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలు చేశారు 

అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు  తీరు ఉందన్నారు. నాడు జగన్  చేసిన తప్పే నేడు చంద్రబాబు చేస్తున్నారన్నారు అధికారంలో ఉండగా స్వర్గీయ NTR పేరు మార్చి YCP   ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత YSR పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటోందని విమర్శించారు. కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని మండిపడ్డారు. 

YSR జిల్లాను తిరిగి YSR కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా.. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తీసెయ్యడాన్ని ఖండిస్తున్నామన్నారు. YSR అంటే ఎందుకింత కక్ష అని అడుగుతున్నామని YSR జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న NTR జిల్లాకు  NTR విజయవాడ అనో లేక పాత కృష్ణ జిల్లాకు NTR కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని ప్రశ్నించారు. 

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆధ్యుడని షర్మిల గుర్తుచేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత అన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు , పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత YSR అని చెప్పారు.  తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న  గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు. YSR అనే పేరు ప్రజల ఆస్తి. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు.  YSR తెలుగు వారి సొత్తని స్పష్టం చేశారు. 

జగన్ సీఎంగా ఉన్నప్పుడు అనేక చోట్ల ఎన్టీఆర్ పేరును తొలగించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును కూడా తొలగించారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీని సీఎంగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు ప్రారంభించారు. అయినా  వైద్య రంగానికి ఎన్టీఆర్ కు సంబంధం లేదని వైఎస్ఆర్ డాక్టర్ అని ఆయన పేరు ఉండటం కరెక్ట్ అని పేరు మార్చారు. అయితే ప్రభుత్వం మారగానే మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరుగానే మార్చింది. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Sandeep Reddy Vanga On Raptadu Case: రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు
రాప్తాడు ఘటనపై సందీప్ రెడ్డి వంగా రియాక్షన్... సినిమాలను టార్గెట్ చేయవద్దు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget