Case Filed Against Influencers in Betting App Case | ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ?
బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది ప్రాణాలు తీసుకుంటున్నారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినా కూడా చాలామంది ఎదో రకంగా ఇంఫ్లూయన్స్ అయి మళ్ళి అవే యాప్స్ ని వాడుతున్నారు. మనుషులు చనిపోతుంటే కూడా అవి నిజామా.. కాదా అని కనీసం చెక్ చేసుకోకుండా డబ్బులు పెట్టేస్తున్నారు.
మనకి ఎవరో ఒకరు వచ్చి అరేయ్ ఈ యాప్ లో డబ్బులు పెడితే నాకు లాభం వచ్చిందని అంటదు. మనం కూడా నాకు డబ్బులు వస్తే బాగుండు అని డబ్బులు పెడతాము. మనం పెట్టిన డబ్బులకి నిజంగానే స్టార్టింగ్ లో లాభం వస్తుంది. డబ్బులు వస్తున్నాయి కదా అని మనం కూడా బెట్టింగ్ వేస్తూ వెళ్తాము. ఆలా మనకి యాప్ వాడడం బాగా అలవాటు అవుతుంది. ఒక స్టేజ్ కి వచ్చాక పెద్ద అమౌంట్ పెట్టెస్తాము. అంతే. డబ్బులు పోతాయి. అప్పులు పెరిగి పోతాయి. తర్వాత ఎం జరుగుతుందో మీకు తెలుసు.
ఈ యాప్స్ ని ఎవరో ఒకరు ప్రోమోట్ చేస్తేనే కదా మన వరకి వస్తాయి. ఆ ప్రోమోటర్స్ నే టార్గెట్ చేసారు ఐఏఎస్ వీసీ సజ్జనార్. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా బెట్టింగ్ యాప్స్ వలలో ఎవరు పడొద్దని, వాటిని ప్రమోట్ కూడా చేయడం తప్పని చెప్తున్నారు. యూట్యూబ్ అన్వేష్ తో కలిసి సే నో టూ బెట్టింగ్ యాప్స్ అంటూ అందరికి తెలియజేసారు.
నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానెల్ ఎంత ఫేమసో అందరికి తెలుసు. ప్రపంచ దేశాలు తిరిగే అన్వేష్ బెట్టింగ్ యాప్స్ పై ఎప్పటి నుండి ఫైట్ చేస్తున్నాడు. ఈ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్లపై ఎన్నో సార్లు తన వాయిస్ రైస్ చేసాడు.
పోలీస్ అలెర్ట్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ల లిస్ట్ రెడీ చేసారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న ఎంతోమంది ఈ లిస్ట్ లో ఉన్నారు. లోకల్ బాయ్ నానీ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఏపీ డీజీపీ హరీష్‌కుమార్‌కు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోకపోతే.. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కోరారు.
పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ కోట్లలో సంపాదించాడట. బైక్ రైడర్ సన్నీ యాదవ్ కోసం ఇప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. హర్ష సాయిపై కేసు రిజిస్టర్ అయింది. వీరితో పాటు యాంకర్ శ్యామల, విష్ణు ప్రియ, సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, ప్రణవి తో పాటు ఇంకో 10 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసారు.
ఈ బెట్టింగ్ యాప్స్‌ని బ్యాన్ చేస్తే బాగుండని బాధితులు కోరుకుంటున్నారు. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్-1867 ప్రకారం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ చట్టవిరుద్ధం. కానీ కొన్ని యాప్స్ ఫారిన్ లైసెన్స్ తో మన ఇండియాలో వాడుతున్నారు. వీటికి దూరంగా ఉండడమే అన్నిటికన్నా ఉత్తమమమైన మార్గం అని పోలీసులు సూచిస్తున్నారు. ఈ యాప్స్ పై గవర్నమెంట్ ఖాచితంగా ఎదో ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని బాధితులు సూచిస్తున్నారు.





















