అన్వేషించండి

Telangana Politics: చట్టం కళ్లకు గంతలు కట్టారు కానీ ప్రజల్ని ఏమార్చగలరా? - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నైతికత ఉంటుందా?

Defecting MLAs: పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు చెప్పారు. ఎవరూ పార్టీ మారినట్లుగా ఆధారాల్లేవన్నారు. కానీ నిజం ఏమిటో ప్రజల కళ్ల ముందే ఉంది కదా అన్న ప్రశ్న వస్తోంది.

Controversy over defecting MLAs: తెలంగాణ రాజకీయాల్లో నైతిక విలువలు ఇప్పుడు ఒక ‘జోక్’గా మారిపోయాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ప్రలోభాలకో ,  వ్యక్తిగత ప్రయోజనాలకో తలొగ్గి పార్టీలు మారడం పరిపాటిగా మారింది. అయితే, ఈ ఫిరాయింపుల కంటే దారుణమైన విషయం ఏమిటంటే.. తాము పార్టీ మారలేదని, ఇంకా పాత పార్టీలోనే ఉన్నామని ఆయా నాయకులు బుకాయించడం. ప్రజల కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాలను కప్పిపుచ్చుతూ ఆడుతున్న ఈ  దేవతా వస్త్రాల  నాటకం రాజకీయ పతనానికి పరాకాష్టగా నిలుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

స్పీకర్ నిర్ణయం - విస్మయకర వాస్తవాలు 

పదిమంది ఎమ్మెల్యేలు కండువా మార్చి కాంగ్రెస్‌లో చేరిన విషయం రాష్ట్రవ్యాప్తంగా అందరికీ తెలుసు. వారు కాంగ్రెస్ వేదికలపై కనిపించారు, ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వాములయ్యారు. రాజకీయంగా ఆ పార్టీ విజయం కోసం పని చేశారు. కానీ, సాంకేతిక అంశాలను సాకుగా చూపిస్తూ వారెవరూ పార్టీ మారలేదని స్పీకర్ కార్యాలయం ప్రకటించడం సామాన్య ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి గెలిచి, కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ వంటి వారు కూడా పార్టీ మారలేదని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహసించడమేనన్న అభిప్రాయం సహజంగానే వస్తోంది. చట్టంలోని లొసుగులను వాడుకుని అనర్హత వేటు నుంచి తప్పించుకోవచ్చు కానీ, ప్రజా కోర్టులో ఎలా సమర్థించుకుంటారన్న ప్రశ్న వస్తోంది. 

పటాన్‌చెరు పరిణామం - అసలైన అసమ్మతి 

ఈ ఫిరాయింపుల పర్వంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వ్యవహారం మరో ఆసక్తికర మలుపు. కాంగ్రెస్‌లో చేరినప్పటికీ, స్థానిక నాయకత్వం నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకత, పార్టీలో ఇమడలేక పోవడం వంటి కారణాలతో ఆయన మళ్లీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక్క ఎమ్మెల్యే సమస్య మాత్రమే కాదు, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ,  ఓటర్ల మనోభావాలను అధికార పార్టీ ఎంతలా విస్మరిస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అనుకోవచ్చు.  జగిత్యాలలోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఫిరాయింపులు ఉన్న అన్ని చోట్లా ఇదే సమస్య.  

చట్టం వర్సెస్ నైతికత 

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్  అనర్హత వేటు చట్టం ఉద్దేశం ఫిరాయింపులను అరికట్టడం. కానీ, నేటి రాజకీయాల్లో ఆ చట్టమే ఫిరాయింపుదారులకు రక్షణ కవచంగా మారుతోంది.  మేము పార్టీ మారలేదు, కేవలం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం అనే సాకులు నైతికంగా పతనమైన నాయకత్వానికి నిదర్శనం. ధైర్యంగా పార్టీ మారినట్లు చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఈ ప్రజాప్రతినిధులు, రేపు ఎలా  ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతారనేది పెద్ద ప్రశ్న.  తమ ఓటును వస్తువుగా మార్చి, అంగడిలో సరుకులా పార్టీలను మారుతున్న నేతలను ప్రజలు ఎల్లకాలం సహిస్తారని అనుకోవడం భ్రమ. చట్టం ముందు గెలిచినా, ప్రజల మనసుల్లో వీరు ‘అనర్హులు’గానే ముద్ర పడిపోతున్నారు. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీలు కాలక్రమేణా భారీ మూల్యాన్ని చెల్లించుకున్న చరిత్ర మన కళ్లముందే ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఈ విలువల లేని రాజకీయం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.  

టాప్ హెడ్ లైన్స్

Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
AP Local Body Election: నామినేషన్ దాఖలు పొడిగింపుపై ఏపీ ఎస్ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నామినేషన్ దాఖలు పొడిగింపుపై ఏపీ ఎస్ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Erravelli Farmhouse Water: కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి రగడ - కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసుల షాక్!
కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీటి రగడ - కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసుల షాక్!
Vijayawada Mayor Election : బెజవాడ మేయర్ సమరం - కూటమికి ఏబీవీనే ప్రధాన ప్రత్యర్థిగా మారారా?
బెజవాడ మేయర్ సమరం - కూటమికి ఏబీవీనే ప్రధాన ప్రత్యర్థిగా మారారా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
Deepika Padukone Second Baby Name: దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Embed widget