అన్వేషించండి
AP Container Hospital: ఏపీలో తొలి కంటైనర్ హాస్పిటల్ ప్రారంభం, డోలీ మోతలకు చెక్ - లభించే వైద్య సేవలు ఇవే
Andhra launches first container hospital | ఏపీలో తొలి కంటైనర్ హాస్పిటల్ ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రారంభించారు. ఇక డోలీ మోతలకు స్వస్తి చెబుతామన్నారు.

ఏపీలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారభం, డోలీ మోతలకు చెక్
1/9

ఆంధ్రప్రదేశ్‌లో తొలి కంటైనర్ ఆసుపత్రిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం నాడు ప్రారంభించారు. ఏపీలో గిరిజనులకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని, అందులో భాగంగా తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. గిరిజనుల డోలీ మోతలకు స్వస్తి పలుకుతామన్నారు.
2/9

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కరడవలసలో వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసిన గిరి ఆరోగ్య కేంద్రం (Container Hospital)ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రాంతీయ ఆరోగ్య సేవల కోసం ప్రారంభించామన్నారు. ప్రాంతీయ గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇది చేశామని తెలిపారు.
3/9

నరింజ పాడు, కరడవలస, బెల్లపాక, బొడ్డపాడు, కరడకోటవలస (సాలూరు మండలం)తో పాటు కంకనపల్లి, ఆజూరు, చాకిరేవువలస, కుంబివలస (పాచిపెంట మండలం) గ్రామాలకు ఈ కంటైనర్ ఆసుపత్రి సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ప్రాథమిక చికిత్స కోసం గ్రామీణులు చాలా దూరం ప్రయాణించడాన్ని ఇది తగ్గిస్తుందని గుర్తుచేశారు.
4/9

కంటైనర్ ఆసుపత్రిలో వారానికి ఒకసారి వైద్యాధికారి ఓ.పి సేవలు అందిస్తారు, ప్రతినెలకు రెండు సార్లు రెండు, నాలుగు బుధవారాల్లో 104 మొబైల్ మెడికల్ యూనిట్ వస్తుందని గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు. వారానికి మూడు సార్లు ఏఎన్ఎం, ఎం.ఎల్. హెచ్.పి ఇక్కడ ఓపి సేవలు నిర్వహిస్తారు. ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటారుని, 105 రకాల మందులు అందుబాటులో ఉంచామన్నారు.
5/9

బీపీ, మధుమేహానికి (Diabetes) సంబంధించిన మందులు ఇక్కడ తీసుకోవచ్చని, గర్భిణీ స్త్రీలకు కూడా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రక్తహీనత కలిగిన గర్బిణీలకు ఐరన్ టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయి, ఇక్కడే వారికి ఐరన్ ఇంజక్షన్లు ఇస్తామన్నారు.
6/9

గర్భిణీలకు నెలకు ఒకసారి హెల్త్ చెకప్, రక్త పరీక్షలు చేస్తామన్నారు. డెంగ్యూ, మలేరియా, షుగర్, హెచ్ఐవి, హెపటైటీస్, నీటి చెకింగ్, టీబీ-కెల్ల, హెచ్సివి, అయోడిన్, యూరిన్, హెచ్సీజీ - కిట్, కంటి చూపు సహా 14 రకాల టెస్టులు చేయనున్నారు. చిన్నపిల్లలకు టీకాలు వేస్తామని తెలిపారు.
7/9

ఈ ప్రాంతాల్లో రక్తహీనత లోపం అధికంగా ఉందని, ఇందుకోసం ఎనీమియా యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ 15 రోజులకు ఒకసారి సమీక్ష చేసి, గర్భిణీలకు, బాలింతలకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించనుంది.
8/9

కౌమార దశలో ఉన్న బాల బాలికల కోసం ఇక్కడ ప్రత్యేక ఆరోగ్య సదస్సు, ట్యూబర్క్యూలోసిస్ గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తామని కలెక్టర్ వివరించారు. గర్భధారణ, ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ, నవజాత శిశువు, శిశు ఆరోగ్య సేవలు లభిస్తాయన్నారు. బాల్య, వయో పరితుల ఆరోగ్య సంరక్షణ సేవలు, నిరోధక సేవలు, ఇతర ఆరోగ్య సేవలు, సంక్రామక వ్యాధుల నిర్వహణ చేస్తామని తెలిపారు.
9/9

తేలికపాటి వ్యాధులు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తాం. సంక్రామకేతర వ్యాధుల స్క్రీనింగ్, నివారణ, నియంత్రణతో పాటు నిర్వహణ ఉంటుందని కలెక్టర్ చెప్పారు. కంటి, చెవి, ముక్కు, గొంతు సమస్యల (ENT Proplems)కు చికిత్స అందించనున్నారు. అత్యవసర వైద్య సేవలు, మానసిక ఆరోగ్య సమస్యల స్క్రీనింగ్ ఉంటుందని కలెక్టర్ వివరించారు.
Published at : 25 Nov 2024 07:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion