GV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP Desam
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. కేవలం ఫైబర్ నెట్ కే కాదు టీడీపీ కి కూడా రిజైన్ చేస్తూ తన రాజీనామా లేఖను అధినేత చంద్రబాబుకు పంపించారు. నిఖార్సైన టీడీపీ కార్యకర్తగా వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ను వైసీపీ నేతలను చాలా స్ట్రాంగ్ గా ఎదుర్కొన్న జీవీ రెడ్డి చిన్న వయస్సులో చంద్రబాబు ఆశీస్సులు పొందటంతో పాటు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఫైబర్ నెట్ ఛైర్మన్ గా నూ పదవిని అందుకున్నారు. కానీ జీవీ రెడ్డి ఇప్పుడు ఉన్నపళంగా రాజీనామా చేయటానికి కారణాలేంటీ అందుకు దారి తీసిన పరిస్థితులేంటీ మా కరస్పాండెంట్ విజయ సారథి అందిస్తున్న అనిలిటికల్ స్టోరీ మీ కోసం. టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు జీవి రెడ్డి చేసిన ఆరోపణల పై ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే.. జీవి రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి టీడీపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి కారణం ప్రభుత్వం ఏర్పాటు కావడం కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం.. కష్టపడిన తమకంటే.. Ias అధికారులపైనే చంద్రబాబు ప్రేమ చూపిస్తున్నారనే ఆరోపణలే ఇందుకు కారణమా అన్న అంశం జీవి రెడ్డి రాజీనామాతో మరోసారి తెర మీదకు వచ్చింది





















