అన్వేషించండి

Shri Nimishamba Devi Temple: ఈ ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరుకుంటే 21 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు!

Nimishambhika Devi Temple : ఆలయానికి ఎవరు వెళ్లినా బాధలు తొలగించమని, సంతోషాన్ని ఇమ్మనే కోరుకుంటారు. అలాంటి భక్తులను అనుగ్రహించడంలో ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు ముందుటుంది...

 Nimishambhika Devi Temple in Boduppal Hyderabad: సమస్యలు లేని మనుషులుంటారా? ఆలయానికి వెళ్లి కోర్కెలు కోరుకోని భక్తులుంటారా?. చేసే పూజలు, ఉపవాసాలు, నోములు, మొక్కులు అన్నీ సమస్యల నుంచి బయపడేందుకే. అయితే నిముషంలో కోరుకుంటే మీరు ఊహించనంత తక్కువ సమయంలో తీర్చేసే అమ్మవారి గురించి తెలుసా? ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు..హైదరాబాద్ బోడుప్పల్ లో ఉంది ఆ ఆలయం. 

నిముషాంబ దేవిని దర్శించుకుని ఆలయంలో 16 ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల విశ్వాసం. అప్పులు ఉన్నవారు , చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నవారు అమ్మను భక్తిపూర్వకంగా దర్శించకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారని నమ్మకం. 

ముఖ్యంగా పెళ్లికానివారు ఈ ఆలయానికి వెళ్లి మొక్కుకుంటే త్వరలోనే పెళ్లి జరిగిపోతుందట 

చిలుకూరు బాలాజీ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుని మొక్కుకుంటారు..అది నెరవేరితే 108 ప్రదక్షిణలు చేస్తారు

అలానే..

నిముషాంబ దేవి ఆలయంలో ముందుగా 16 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కుకుంటే ఆ కోర్కె 21 రోజుల్లో తీరిపోతుందట. ఆ తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి

Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!

ఇక్కడ అమ్మవారికి భారీ నైవేద్యాలు కూడా అవసరం లేదు. కేవలం నిమ్మకాలు నివేదిస్తే చాలు ఆనందపడిపోతుంది..భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయలను తీసుకెళ్లి ఇంట్లో ఉంచితే అన్నింటా శుభ ఫలితాలు సాధిస్తారు, ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
 
మొక్కుకున్నవారు అయితే నిముషాంబ దేవికి గాజులు, వస్త్రాలు, నిమ్మకాయలు సమర్పిస్తారు. 

నిముషాంబ దేవికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆలయాలున్నాయి. ప్రముఖ ఆలయం కర్ణాటక రాష్ట్రం  శ్రీరంగపట్నం సమీపం గంజాం దగ్గర కావేరీ నది ఒడ్డున కొలువైంది. 

నిముషాంబ దేవి పుట్టుకకు ఓపురాణ కథ చెబుతారు

పూర్వం ముక్తకుడు అనే రుషి లోకకళ్యానార్థం యాగాన్ని తలపెట్టాడు.  శివుడి అంశతో జన్మించిన ఆ రుషి చేస్తున్న యాగాన్ని చెడగొట్టేందుకు రాక్షసులు ప్రయత్నించారు. చివరకు ఆ రుషి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యే క్షణంలో పార్వతీదేవి ప్రత్యక్షమై అసురుల్ని వధించింది. అంతా నిముషంలో జరిగిపోయింది. అప్పుడు రుషులంతా...అప్పటివరకూ ఉన్న కష్టాన్ని నిముషంలో తీర్చేసిన అమ్మవారిని నిముషాంబగా స్తుతించారు.

కర్ణాటకలో ఉన్న నిముషాంబ ఆలయంలో భలిభోజనం ప్రత్యేకం. నిత్యం కాకులకు ఆహారం పెడతారు. గోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మండప పైకప్పు నుంచి వేలాడుతున్న ఒక భారీ  గంట కనిపిస్తుంది. ఈ గంటను భక్తులు అస్సలు మోగించకూడదు. కేవలం కాకులకు నైవేద్యంగా బలి భోజనాన్ని బలి పీఠంపై ఉంచినప్పుడు మాత్రమే ప్రధాన అర్చకుడు ప్రతిరోజూ నిర్ణీత సమయంలో ఈ గంట మోగిస్తాడు.  

నిమిషాంబ దేవి అవతరించిన ప్రదేశం గంజాం..అయితే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ అమ్మవారికి ఆలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల భక్తులు దర్శించుకునేందుకు వీలుగా హైదరాబాద్ సమీపం బోడుప్పల్‌లోని కూడా ఓ ఆలయం ఉంది. భక్తివిశ్వాసాలతో అమ్మవారిని ప్రార్థిస్తే చాలు  కోర్కెలు వెంటనే ఫలిస్తాయి.  ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన ఆంటంకాలు వైనా కానీ అమ్మవారి దర్శనంతో తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. 

శ్రీ మాత్రే నమః

Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget