చాణక్య నీతి: నీది కాని సమయం నీకు సంతోషాన్నివ్వదంటే ఇదే!

ఆయమమృతణనిధానం నాయకో ఔషధీనాం అృతమయశరీరః కాన్తియుక్తోఅపి చన్ద్రః
భవతి విగతరశ్మిణ్ణలే ప్రావ్య భావోః వరసదననివిష్టః కో స సఘుత్వం యాతి

పరాయివాళ్ల అధీనతలో ఎప్పటికీ సుఖం ఉండదనేది ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అర్థం

చంద్రుడి శరీరం మొత్తం అమృతమే..సకల ఔషధాలకు అధిపతి చంద్రుడు

అందం, అమృతం, ఔషధం..ఇవన్నీ ఉన్నా సూర్యుడు రాగానే చంద్రుడి తేజస్సు కళావిహీనం అయిపోతుంది

రాత్రికి చంద్రుడు అధిపతి అయినట్టే పగటికి సూర్యుడు అధిపతి

ఒక్కొక్కరిది ఒక్కో సమయం..అంటే పగలు సూర్యుడి ఇల్లు అంటే రాత్రి చంద్రుడి ఇల్లు

ఒకరి ఇంట్లో మరొకరికి గౌరవం ఉండదు..పరాయి వారింట్లో అంతా చిన్నవారైపోతారు

వేరే వారి ఇంట్లో ఉండడం అంటే..దుఃఖాన్ని కొనితెచ్చుకోవడమే అని బోధించారు చాణక్యుడు