Types of Bathing: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!
Spiritual Bath: నిత్యం ఆచరించే స్నానం దేహాన్ని శుభ్రం చేసుకునేందుకు అయితే.. ప్రత్యేక రోజుల్లో చేసే స్నానం ఆత్మను శుద్ధి కోసం..దానినే ఆధ్యాత్మిక స్నానం అంటారు. ఇంకా స్నానంలో ఎన్ని రకాలున్నాయో తెలుసా

Types of Bathing: నిత్యం ఉదయాన్నే దేహం శుభ్రం చేసుకునేందుకు స్నానం ఆచరిస్తాం. నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపలన్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడమే స్నానం ప్రధాన ఉద్దేశం...ఈ ప్రక్రియ పూర్తయ్యాక శరీరంలో చురుకుదనం పెరుగుతుంది. ఎందుకంటే శరీరంలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, విద్యుచ్ఛక్తి కేంద్రంగా ఉంటుంది. ఈ శక్తి బయటకు పోతూ మళ్లీ కొత్తగా తయారవుతూ ఉంటే ఉత్సాహంగా ఉంటారరు. ఈ ప్రక్రియనే "electro-magnetic activity” అంటారు. స్నానం వెనుకున్న అసలైన ఆంతర్యం ఇదే..
ఉదయాన్నే ఎందుకు?
స్నానం ఎప్పుడు చేస్తే ఏమవుతుంది..ఉదయాన్నే ఎందుకు అనే సందేహం వచ్చి ఉండొచ్చు. రాత్రి నిద్రపోయినప్పటి నుంచి మళ్లీ లేచేవరకూ శరీరంలో విద్యుశ్చక్తి బయటకు పోదు. ఫలితంగా నీరసంగా,బద్ధకంగా అనిపిస్తుంది. అందుకే నిద్రలేవగానే కాసేపు నడక, వ్యాయామం చేస్తే లోపలున్న విద్యుశ్చక్తి బయటకు పోయి ఉత్సాహం వస్తుంది. స్నానంతో ఆ ప్రక్రియ సంపూర్ణం అయి మరింత ఉల్లాసంగా మారుస్తుంది.
Also Read: ప్రాతఃస్మరామి లలితా.. ఈ రోజే లలితా జయంతి.. ఆచరించాల్సిన విధులివే!
స్నానాలు ఎన్నిరకాలు?
పంచ స్నానాని విప్రాణాం కీర్తితాని మహర్షిభిః |
ఆగ్నేయం వారుణం బ్రహ్మం వాయవ్యం దివ్యమేవచ ||
ఈ శ్లోకం ప్రకారం స్నానం ఐదు రకాలు. అవే ఆగ్నేయ స్నానం, వరుణ స్నానం, బ్రహ్మ స్నానం, వాయవ్య స్నానం, దివ్య స్నానం.
ఆగ్నేయ స్నానం అంటే విభూధిని ధరించడం. హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోవడం. ప్రయాణాల్లో ఉండేవారు , స్నానానికి అవకాశం లేనప్పుడు సంధ్యావందనం చేయాలి అనుకుంటే విభూధి ధరిస్తారు..దీనినే ఆగ్నేయ స్నానం అంటారు. విభూది అగ్ని నుంచి వచ్చినదే కదా..అంతకు మించిన పవిత్రత ఇంక దేనికుంటుంది.
శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||
నీటిలో నిండా మునిగి చేసే స్నానాన్ని వారుణ స్నానం అంటారు. ఇది నిత్యం ఆచరించే స్నానం.
బ్రహ్మ స్నానం అంటే
"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః"
అనే మంత్రాన్ని స్మరిస్తూ నీటిని తలపై చల్లుకుంటారు. దీనినే బ్రహ్మ స్నానం అంటారు. కొద్దిపాటి నీటిని తలపై చల్లుకుని శుద్ధి చేసుకోవడం అన్నమాట. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అని నీళ్ళని తీసి పూజా ద్రవ్యాలపై, దేవుడిపై చిలకరిస్తారు. ఆత్మానం అంటూ పూజ ఆచరించేవారు చల్లుకుంటారు...ఇది కూడా బ్రహ్మ స్నానమే.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుంచి రేగే ధూళితో చేసే స్నానాన్ని వాయువ్య స్నానం అంటారు. 33 కోట్ల దేవతులు కొలువుండే గోధూళిని మించిన పవిత్రత ఏముంటుందని పద్మపురాణం పేర్కొంది.
ఇక దివ్య స్నానం అంటే..ఒక్కోసారి ఎలాంటి మబ్బులు, ఉరుములు లేకుండా వాన ముంచుకొస్తుంది. అనుకోకుండా అలాంటి వానలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆకాశంలో సూర్య భగవానుడు కిరమాలు ప్రసరిస్తున్నా మరోవైపు వాన కురుస్తుంది. అలాంటి వానలో అనుకోకుండా చేసే స్నానమే దివ్యస్నానం.
పండుగలు , పుష్కరాలు, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి లాంటి ప్రత్యేక రోజుల్లో ఆచరించే స్నానాలను ఆధ్యాత్మిక స్నానం, పుణ్యస్నానం అంటారు. ఈ స్నానాలతో ఆత్మ శుద్ధి అవుతుందని విశ్వసిస్తారు. దీనినే నైమిత్తిక స్నానం అంటారు..అంటే ఓ నిమిత్తాన్ని పురస్కరించుకుని ఆచరించేది అని అర్థం.
వీటితో పాటూ మానసిక స్నానం కూడా ఉంది. నిత్యం భగవంతుడి నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను, అనవసర డాంభికాలను, మనసులో మాలిన్యాన్ని వదిలించుకోవడమే మానసిక స్నానం. ఈ స్నానాన్ని మహర్షులు, రుషులు ఆచరిస్తారు.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

